‘జీలకర్ర’ తో స్థూలకాయాన్ని తరిమికొట్టండిలా…!

Spread the love

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
Cell 9949363498

‘జీలకర్ర’ తో స్థూలకాయాన్ని తరిమికొట్టండిలా…! It

బరువు తగ్గడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. స్థూలకాయులు బరువు తగ్గేందుకు గంటల తరబడి జిమ్‌లలో చెమట చిందిస్తుంటారు. దీనికితోడు రకరకాల డైటింగ్‌ను ఫాలో అవుతుంటారు. ఇటువంటివారికి జీలకర్ర దివ్య ఔషధం. దీనిని ‘కర్ర కాని కర్ర’గా అభివర్ణిస్తుంటారు. బరువు తగ్గేందుకు చెమ్చాడు జీలకర్రను నియమానుసారం సేవిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. ప్రతీరోజూ ఒక చెమ్చాడు జీలకర్రను సేవించడం ద్వారా మూడింతలు త్వరగా ఫ్యాట్ కరుగుతుంది. జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు బర్న్ అవడమే కాకుండా జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది. క్రమం తప్పకుండా 20 రోజుల పాటు జీలకర్రను తినడం వలన 15 కిలోల వరకూ బరువు తగ్గే అవకాశముంది. అలాగే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కూడా సునాయాసంగా కరిగిపోతుంది.

1. రాత్రి రెండు చెమ్చాల జీలకర్రను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వేడిచేసి తేలిన జీలకర్రను తొలగించాలి. ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూను నిమ్మరసం కలుపుకొని పరగడుపునే ఖాళీ కడుపుతో తాగాలి. రెండు వారాలు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2. జీలకర్రతో పాటు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా అల్లాన్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరువాత కేరెట్‌తో పాటు ఇతర కూరగాయలు ఉడికించుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం ముక్కలు వేసుకుని సూప్ తయారు చేసుకోవాలి. ప్రతీరోజూ రాత్రి దీనిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.

Also READ:   తులసి చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ ఉపయోగాలు

3. ఒక గ్లాసు నీటిలో ఒక పెద్ద చెమ్చాడు జీలకర్రను వేసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని మరిగించి టీ మాదిరిగా తాగండి. ఇలా రోజూ చేయడం ద్వారా శరీరంలోని అనవసరపు కొవ్వు కరిగిపోతుంది. అయితే ఈ నీటిని తాగిన తరువాత ఒక గంటపాటు ఏమీ తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోంది.

జీలకర్ర (క్యూమిన్ సీడ్)రోగాలపై
*******************
కడుపులో నులిపురుగుల నివారణకు : జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం.
❤️గర్భాశయ బాధలు తగ్గుటకు : జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.

Also READ:   లివర్ చెడిపోకుండా ఇలా శుభ్రం చేసుకుంటే లక్షల రూపాయల్ని మిగిలించుకోవొచ్చు

❤️మూత్ర సంబంధ వ్యాధులకు : జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. నీరసము తగ్గుటకు : ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది. పేగులు శుభ్రపరచుట : ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.

❤️పైత్యరోగాలకు
*******
జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే … తలతిప్పు, కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును .

Also READ:   *నోటిలో బొబ్బలు*        ( Blisters )

❤️తేలుకుట్టుకు
********
జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును

❤️అరతులము జీలకర్ర ఇనుమూ గరిటెలో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి … చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి .
❤️వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్రతో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచముగా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును

జీలకర్రఉపయోగాలు

⛺ జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.

⛺ కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
❤️కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న

❤️నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.

⛺జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి.

Updated: July 15, 2018 — 1:23 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *