అడగకూడని ప్రశ్న

అడగకూడని ప్రశ్న !

కోర్టులో ఒక హత్యా కేసులో ప్రభుత్వ వారి సాక్షిగా ఒక డబ్బై ఏళ్ళ వృద్దురాలు శ్రీమతి సూర్యకాంతం గారిని ప్రవేశపెట్టారు. .
.
.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుమ్మడి గారిలా కళ్ళజోడు తుడుచుకుంటూ ” చూడమ్మా! నేనేవరో నీకు తెలుసా?” అనడిగాడు .
.
.
దానికా వృద్ధురాలు నోరు నొక్కుకుంటూ ” ఓరి భడవా ! నువ్వు తెలియకపోవడమేమిటీ! నువ్వొక అడ్డగాడిదవి. చిన్నప్పుడు గోలీకాయలు ఆడుకుంటూ మా వీధిలోనేగా పెరిగింది. చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడివి. మా కిష్టిగాడి పెన్సిళ్ళు కలాలు ఎత్తుకెళ్ళి జీడీలు కొనుక్కుంటూ పెరిగావు! ఇదిగో ఇప్పుడు ఈ నల్లకోటు ఎవరిదో కొట్టుకొచ్చి ఇలా నిలబడ్డావు” అన్నది. .
.
.
ప.పా : ” అలా మాట్లాడకూడదు. అదిగో అక్కడ కూర్చున్నాడే ఆ డిఫెన్స్ లాయర్ గారు తెలుసా ? ” అనడిగాడు. .
.
.

Related:   ప్యారాచూట్

వృద్ధురాలు : ” ఆ దొంగచచ్చినోడు తెలియకపోవడమేమిటీ ! ఆ వెధవ చడ్డీలు వేసుకున్నప్పటి నుండి తెలుసు. వాడు పెళ్ళాన్ని నానా యాతనలు పెడుతుంటే నేనేగా వెళ్ళి ఒదార్చేదాన్ని. అంత మహాఇల్లాలు ఉండగా ఈ జడ్డీగాడు సాని కొంపల చుట్టూ తిరుగుతూ దానిని, పిల్లల్ని ఏడిపించుకు తినేవాడు. చివరికి ఆ ఇల్లాల్ని కిర్సనాయిలు పోసి తగలబెట్టడానికి కూడా ప్రయత్నించాడు. సమయానికి నేను రాబట్టి ఇరుగుపొరుగు వారిని పిలిచి నాలుగు చివాట్లు పెట్టి ఆ కాపురం బాగు చేశాను. ఆ అప్రాచ్యుడు ఇక్కడ తగలబడ్డడేమిటీ ” అని నోరు నొక్కుకుంది..
.
.
కోర్టు హాలు నవ్వులతో కేరింతలతో మారు మ్రెగిపోతుంటే, సెషన్స్ జడ్జీగారు కోర్టును పదినిమిషాలు వాయిదా వేసి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను, డిఫెన్సు లాయర్ను తన గదికి పిలిపించి ఇలా అన్నాడు..
.
.
” మీలో ఎవరైనా ఆవిడని, ఆ వృద్ధురాలిని, జడ్జీగారు తెలుసా? అని ప్రశ్నించారు అంటే మీ ఇద్దరికీ కోర్టుధిక్కార నేరము కింద వారం రోజులు జైలు శిక్ష విధించబడుతుంది” అని హెచ్చరిక జారీ చేశాడు.

Related:   రామచిలుక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *