అదిరి పోయే రుచితో ఇడ్లీ , దోశెలు మరియు చపాతీల లోకి కారప్పొడి

అదిరి పోయే రుచితో ఇడ్లీ , దోశెలు మరియు చపాతీల లోకి కారప్పొడి .

కావలసినవి .

నూనె — మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు – 12
పచ్చిశనగపప్పు — అర కప్పు
చాయమినపప్పు — అర కప్పు
ధనియాలు — అర కప్పు
కరివేపాకు — కప్పు
ఉప్పు — తగినంత

తయారు చేయు విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టుకుని నూనె మొత్తము పోసి నూనె బాగా కాగనిచ్చి వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు వేసి బాగా వేగ నివ్వాలి .

READ:   జొన్న ఇడ్లితో లాభాలెన్నో

తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేగ నివ్వాలి .

చల్లారగానే మొత్తము మిక్సీ లో వేసి పప్పులు పూర్తిగా నలగ కుండా మిక్సీ వేసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ , దోశెల లోకి కారప్పొడి సిద్ధం.

ఫోటో — ఇప్పుడే కొట్టిన కారప్పొడి .

Originally posted 2019-02-11 04:18:56.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *