అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ స్కెచ్.. పకడ్బందీ ప్లాన్‌తో రెడీ!


హిట్ ట్రాక్ ఎక్కిన పూరి..

టెంపర్ సినిమా తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఈ సినిమాలో ఆయనిచ్చిన మాస్ కిక్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దీంతో మరోసారి అందరి చూపు పూరిపై పడింది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ రూపొందిస్తున్నారు.

స్టార్ హీరోతో ఆ రెండు సినిమాలు..

స్టార్ హీరోతో ఆ రెండు సినిమాలు..

పూరి జగన్నాథ్- మహేష్ బాబు లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా తెలుగు సినిమా లోకం ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుంచారు. మొదట ‘పోకిరి’ ఆ తర్వాత ‘బిజినెస్‌మెన్’ భారీ హిట్స్ సాధించి భేష్ అనిపించుకున్నారు.

READ:   ఆచార్యకు మరో షాక్: చిరంజీవికి హ్యాండిచ్చిన స్టార్ హీరోయిన్.. ప్రభాస్ చేసిన పనే కారణం.!
-->

ఆ హీరోతో అభిప్రాయ బేధాలు.. అందుకే పూరి!

ఆ హీరోతో అభిప్రాయ బేధాలు.. అందుకే పూరి!

అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో పూరి డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’ కాస్తుందని వార్తలు షికారు చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో పూరిని ఫ్లాప్స్ వెంటాడటంతో పూరి జగన్నాథ్- మహేష్ కాంబో సెట్ కాలేదని వార్తలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వాచ్చాయని, అందుకే ఈ కాంబో సెట్ కాలేదని విన్నాం.

READ:   ఫ్లాపులతో డీలా పడ్డ రౌడీ.. హీరో, లైగర్ విషయంలో కోతలు.. డౌన్ ఫాల్‌లో విజయ్ గ్రాఫ్
-->

 అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ ప్లాన్

అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ ప్లాన్

అయితే అవేవి నిజం కాదని నిరూపించాలని పూరి జగన్నాథ్ బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ పకడ్బందీ ప్లాన్‌తో రెడీ అయ్యారట. వెంటనే మహేష్ బాబుతో ఓ సినిమాను సెట్ చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకోసం కథ కూడా రెడీ చేశారట ఈ డాషింగ్ డైరెక్టర్. మహేశ్ ఓకే అంటే కథ వినిపించేందుకు రెడీగా ఉన్నారనేది లేటెస్ట్ సమాచారం.

READ:   బైలాకుప్పే నుండి నాగరాహోల్ వరకు 3 రోజుల రోడ్ మార్గంలో యాత్ర అనుభవం ఏమిటి?
-->

సూపర్ స్టార్ బిజీ.. ఇంతకీ ఎప్పుడు?

సూపర్ స్టార్ బిజీ.. ఇంతకీ ఎప్పుడు?

పూరి జగన్నాథ్- మహేష్ కాంబో రిపీట్ కానుందనే వార్తలు రావడమే ఆలస్యం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అనే కుతూహలం నెలకొంది ప్రేక్షకుల్లో. అయితే ఇప్పటికే పరశురామ్, వంశీ పైడిపెల్లి లాంటి దర్శకులను లైన్‌లో పెట్టిన మహేష్ ఆయా ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నారు. సో.. పూరికి ఎప్పుడు డేట్స్ సెట్ చేస్తారో చూడాలి మరి.