అభద్రతాభావంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు..? – Pakka Filmy – Telugu

0
7


అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి…? చంద్రబాబు, జగన్ గురించి వద్దు… అసలు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకి వెళ్తుంది…? ఎప్పుడు లేని విధంగా ప్రజల్లో అభద్రతా భావం ఎందుకు కనపడుతుంది. రాజకీయాల మీద ప్రజలు ఇప్పుడు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు…? జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద చర్చలు జరిగే పరిస్థితికి ఎందుకు దిగజారింది రాష్ట్రం…? రాజకీయాల్లో కక్ష సాధింపు ధోరణి అనేది ఇన్నాళ్ళుగా మనం చూస్తూ వచ్చాం, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి వేరేగా ఉంది.

అనూహ్యంగా రాజకీయం, పరిపాలన అనేది కలిసి కక్ష సాధింపుకి వెళ్లి రాష్ట్ర భవిష్యత్తు మీద ప్రశ్నలు వినపడుతున్నాయి. అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతుందని భావించిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అదే అమరావతి కోసం ఉద్యమాలు, నిరసనలు చేస్తూ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాఖ ప్రజలు విశాఖను రాజధానిగా వద్దూ అంటుంటే జగన్ ఎందుకు దూకుడుగా వెళ్తున్నారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. రాయలసీమ ప్రజలు ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారు. చెన్నై, బెంగలూరు కంటే మూడు నాలుగు రెట్ల దూరంలో రాజధాని ఏంటీ అని. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభాసుపాలు అయిపోయింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయ లక్ష్యాల కోసం రాజధానిని అభాసు పాలు చేసి దేశం మొత్తం వెక్కిరించే విధంగా ఉంది పరిస్థితి. భవిష్యత్తులో పాలన మారినా అసలు ఏ విధంగా రాష్ట్రం ముందుకి వెళ్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఈ రాజకీయ పరిస్థితుల్లో, కంపెనీలు గాని, పెట్టుబడులు గాని వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదు. రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ని పాలకులు నిట్టనిలువునా ముంచేశారు అనేది వాస్తవం.

Also READ:   Aneesha: ‘Rajinikanthని కలిశాక నాకు బతుకుపై ఆశ కలిగింది’ - a girl suffering from depression and disorders finally met rajinikanth and now she wants to lead a normal life

ఇప్పుడు ప్రజల్లో కూడా అభద్రతా భావం అనేది కనపడుతుంది. ఇన్నాళ్ళు వ్యక్తులకు మద్దతు ఇచ్చిన వాళ్ళు వ్యవస్థ బాగుపడితే చూడాలి అని కోరుకునే పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలను కూడా ప్రజలు తిడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు పాలకులు ఇచ్చేది ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇప్పుడు దాదాపుగా చచ్చిపోయింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజధాని అనేది విశాఖ వెళ్తే రాష్ట్రం దాదాపుగా చచ్చిపోయినట్టే అంటున్నారు ప్రజలు. ఇక రాష్ట్రం వైపు చూసే వాళ్ళు కూడా ఉండరూ అంటున్నారు.

Also READ:   Chandrababu Naiduకు సిగ్గు లేదు, వాళ్లు బఫూన్లలా..: జ'గన్' ఫైర్

The post అభద్రతాభావంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు..? appeared first on Pakka Filmy – Telugu.

Please View My Other Sites