అమలాపాల్ పెళ్లి అబద్ధం.. బ్రేకప్‌తోనే ప్రియుడు చీటింగ్.. పెళ్లి ఫోటోలు ఓ మిస్టరీ


ఉద్దేశపూర్వకంగానే మీడియాకు..

కొద్దినెలలుగా అమలాపాల్, భవిందర్ సింగ్ సహజీవనం చేస్తున్నారనే వార్తలు మీడియాలో అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. అయితే వాటిని వారిద్దరూ ధృవీకరించినట్టు ఎక్కడా కనిపించలేదు. అయితే ఓ ఫేక్ అకౌంట్ ద్వారా భవిందర్ సింగ్, అమలాపాల్ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. అయితే వాటిని భవిందర్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే పోస్టు చేయించారనే విషయం మీడియాలో వచ్చింది.

 డిలీట్ చేయడంపై అనుమానాలు

డిలీట్ చేయడంపై అనుమానాలు

అలా జరిగిన కొద్ది రోజులకే భవిందర్ సింగ్ తన అధికారిక అకౌంట్‌లో పెళ్లి ఫోటోలు అంటూ పోస్టు చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వాటిని డిలీట్ చేయడం, ఆ ఫోటోలు వెంటనే పలు మీడియా సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై సన్నిహితులు కూడా తికమక పడుతున్నారు. తమకు చెప్పకుండా అమలాపాల్ పెళ్లి చేసుకోదనే మాటను వ్యక్తం చేస్తున్నారు.

READ:   లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నా : శ్రీరామోజు సునిశిత్ - Adya News
-->

 కొద్దిరోజుల క్రితమే బ్రేకప్

కొద్దిరోజుల క్రితమే బ్రేకప్

అమలాపాల్‌ పెళ్లిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తనకు సన్నిహితులుగా భావిస్తున్న కొందరు ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ.. అమలాపాల్, భవిందర్ సింగ్ డేటింగ్ చేస్తున్న మాట నిజమే. కానీ వారిద్దరూ కొద్ది రోజుల క్రితమే విడిపోయారు. పెళ్లి ఫోటోలపై అమలాపాల్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరింత సందేహంగా మారింది అని చెప్పారు.

పాత షోటోషూట్ ఫోటోలనే..

పాత షోటోషూట్ ఫోటోలనే..

ఇటీవల మీడియాలో వెలుగు చూసిన ఫోటోలు గతంలోని ఫోటోషూట్‌కు సంబంధించినవి. మాకు తెలిసినంత వరకు కొద్ది రోజుల క్రితమే అమలాపాల్, భవిందర్ సింగ్ విడిపోయారు. వారిద్దరూ తమ అఫైర్‌కు బ్రేకప్ చెప్పారు. వారిద్దరు పెళ్లి చేసుకోనే అవకాశం లేదు. నిజంగా పెళ్లి జరిగితే దాచాల్సిన అవసరం వారికి లేదు. ఈ విషయంపై మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

READ:   దీపిక పడుకొనే 'చపాక్' సినిమాకు ప్రోత్సాహం: రాయితీ ప్రకటించిన రాష్ట్రం
-->

Amala Paul Marriage With Mumbai Based Singer Bhavninder Singh

బ్రేకప్‌ను భరించలేకే..

బ్రేకప్‌ను భరించలేకే..

అమలాపాల్‌లో భవిందర్ సింగ్ బ్రేకప్ జరిగిందనే విషయంపై మాకు స్పష్టమైన సమాచారం ఉంది. ఆ బ్రేకప్‌ను భరించలేకే భవిందర్ గత ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి డిలీట్ చేసి ఉంటారనుకొంటున్నాం. ఇప్పుడు వారిద్దరూ ఎవరికీ అందుబాటులో లేరు కనుక.. అమలాపాల్ స్పందిస్తే తప్ప పెళ్లి వార్తలపై క్లారిటీ రాదని భావిస్తున్నాం అని సన్నిహితులు చెప్పారు.

READ:   చిక్కుల్లో సీనియర్ నటుడు.. చీటింగ్ కేసుతో ఇబ్బందులు