అరటి కాయల మసాలా కూర

Spread the love

అరటి కాయల  మసాలా  కూర.

అరటికాయలు  —  రెండు .
కాయల్ని నీళ్ళలో వేసి  పై చెక్కు  తీసుకుని  నీళ్ళల్లో చిన్న  చిన్న   ముక్కలుగా  తరుగు కోవాలి .
ఆ ముక్కల్ని  ఒక  గిన్నెలో  వేసుకుని  ముక్కలు  మునిగే  వరకు  నీరు  పోసి, కొద్దిగా  ఉప్పు వేసి   స్టౌ మీద  మెత్తగా  ఉడికించి  నీళ్ళు  వార్చుకోవాలి.
ఉడికిన  ముక్కల పై  కొద్దిగా  పసుపు  వేసుకోవాలి .
మసాలాకు .
ఎండుమిరపకాయలు  — 5

ధనియాలు  —  రెండు స్పూన్లు

జీలకర్ర  —  అర స్పూను

లవంగాలు  —  5

చింతపండు  —  చిన్న ఉసిరికాయంత .

Also READ:   Tommato Biryani

విడదీసి  విడిగా  తడిపి  ఉంచుకోవాలి .
వీటన్నిటినీ  కూర చేయబోయే గంట సేపటి  ముందు  పావు  గ్లాసు  నీళ్ళల్లో  నానబెట్టు కోవాలి .
ఉల్లిపాయలు   —  రెండు  .
పొట్టు  తీసి ముక్కలుగా  తరుగు కోవాలి .
నూనె  —  నాలుగు  స్పూన్లు

ఉప్పు  —  తగినంత .

కొత్తిమీర  —  చిన్న కట్ట .
నానబెట్టిన  ధనియాలు , జీలకర్ర , ఎండుమిర్చి , లవంగాలను   తగినంత  ఉప్పు , చింతపండు    మరియు  నాన బెట్టిన  నీరు  పోసి  ముందుగా  మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .
తర్వాత  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు కూడా  వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .
ఇప్పుడు  మసాలా  ముద్ద  సిద్ధం  అయ్యింది .
ఆ ముద్దను  వేరే  గిన్నెలో కి తీసుకోవాలి .
ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె పోసి నూనె  బాగా  కాగగానే  ఉడికించి  సిద్ధంగా  ఉంచుకున్న  అరటి కాయ  ముక్కలను  వేసి  మూతపెట్టి  అయిదు  నిముషాలు  మగ్గనివ్వాలి.
తర్వాత  సిద్ధంగా  ఉంచుకున్న  మసాలా కూడా  వేసి  మరో  అయిదు  నిముషాలు  మసాలా  పచ్చి వాసన పోయే వరకు ఉంచి పైన కొత్తిమీర  వేసుకుని ,  దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
ఈ  అరటికాయ  మసాలా  కూర  వేడి వేడిగా  తింటేనే  బాగుంటుంది .
మరీ  చల్లారితే  అరటి  కాయ  ముక్క గట్టి పడి  కూర  రుచిగా  ఉండదు .
ఇదే  పద్ధతిలో  బంగాళాదుంప  కూడా  చేసుకోవచ్చు .
బీరకాయ కూరలో కూడా  ముక్కల్ని  ఉడికించకుండా  మగ్గబెట్టి  ఈ  మసాలా  వేసుకుని  చేసుకుంటే  కూర  మంచి రుచిగా  ఉంటుంది .
ఈ అరటి కాయ  మసాలా  కూర  చపాతీలు , రోటీలు  మరియు భోజనము  లోకి  చాలా రుచిగా  ఉంటుంది .

Also READ:   సంక్రాంతి స్పెషల్. తమిళనాడు స్పెషల్ . అశోకా హల్వా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *