అల్పాహారానికి ఇవి మేలు

• అల్పాహారానికి ఇవి మేలు!
బరువు తగ్గాలని వ్యాయామం చేసేవారు అల్పాహారంలో ఇవి తప్పకుండా తీసుకుంటే మంచిది. త్వరగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
* గుడ్డు: బరువు తగ్గించడంలో గుడ్డు కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయి. గుడ్డులోని క్యాల్షియం ఎముక పుష్టికే కాదు.. బరువును తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.
* పెరుగు: ప్రోబయోటిక్స్‌ అందించే వాటిలో పెరుగు ఒకటి. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక తీసుకోవాలి. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు.
* అటుకులు: వీటిలో కెలొరీలు చాలా స్వల్పం. అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకూ మేలు జరుగుతుంది.
* కిచిడి: పప్పులూ లేదంటే బార్లీతో కిచిడిని చేసుకోవచ్చు. తక్కువ మసాలా వేయాలి. వీటిలో వేసే ప్రతి పదార్థం ఆరోగ్యానికి మేలు చేసేది. దీన్ని కొద్దిగా తీసుకున్నా త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. బరువు పెరుగుతారన్న భయం కూడా ఉండదు.
* దంపుడు బియ్యం: మధ్యాహ్నమే కాదు.. ఉదయం పూట కూడా దంపుడు బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకోవచ్చు. ఇందులో పీచు అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. దంపుడు బియ్యం మధుమేహం ఉన్నవారికీ, బరువు తగ్గాలనుకునేవారికి చాలా మేలు చేస్తుంది.
* ఓట్స్‌: పీచు అధికంగా లభించే వాటిలో ఓట్స్‌ కూడా ఉంటాయి. వీటిలో కెలొరీలు చాలా స్పల్పం. నీళ్లలో ఉడికించి తీసుకోవచ్చు. పాలతో కూడా తినొచ్చు. వీటితో ఉప్మా, రకరకాల అల్పాహారాలు చేసుకోవచ్చు.
* బాదం: మాంసకృత్తులు ఎక్కువగా అందించే బాదం ఉదయం పూట తీసుకుంటే మంచిది. వీటిలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. కొవ్వును కరిగించడంలో వీటిలోని పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. పైగా రోజంతా చురుగ్గానూ ఉంటారు.

Related:   ఆయర్వేదం --- #ఆరోగ్యము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *