అల్లు అర్జున్ డేరింగ్ డెసీషన్: కోట్లు పెట్టి కొన్న సినిమాను వేరే హీరోకు ఇచ్చేస్తున్నాడు.!


సంక్రాంతికి వచ్చాడు.. సత్తా చాటాడు

‘నా పేరు సూర్య’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. ఈ సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దుమ్ము దులిపేసింది. మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి పోటీని తట్టుకుని రికార్డులు బద్దలు కొట్టింది.

అక్కడా.. ఇక్కడ రికార్డులు క్రియేట్ చేశాడు

అక్కడా.. ఇక్కడ రికార్డులు క్రియేట్ చేశాడు

ఎన్నో అంచనాలతో విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచే కలెక్షన్ల వేటను ప్రారంభించింది. మొదటి రోజు నుంచే సత్తా చాటిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్ల పైచిలుకు షేర్ సాధించడంతో పాటు ఓవర్సీస్‌లోనూ 3.5 మిలియన్ మార్కును చేరుకుంది. దీంతో పలు రికార్డులు బద్దలైపోయాయి.

READ:   RRR నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ఎన్టీఆర్ చేసిన ఆ సీన్ హాలీవుడ్ మూవీని గుర్తు చేస్తుందట.!
-->

ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతున్న బన్నీ

ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతున్న బన్నీ

‘అల.. వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో అతడు గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బన్నీ గుబురు గెడ్డంతో ఫుల్ మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడట. ఇందుకోసం అతడు ఎవరికీ కనిపించకుండా వెళ్లనున్నాడని సమాచారం.

సూపర్ హిట్ సినిమాను కొన్న అల్లు అర్జున్

సూపర్ హిట్ సినిమాను కొన్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ కొద్ది నెలల క్రితం హిందీలో సూపర్ హిట్ అయిన ‘సోనూకి టిటు కి స్వీటీ’ అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నాడు. వరుసగా సీరియస్ మోడ్ మూవీస్ చేస్తున్న బన్నీ.. దీన్ని రీమేక్ చేసి సరికొత్తగా కనిపించాలని భావించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ మూవీని తెరకెక్కించాలని భావించాడు. ఇంతలో త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ‘అల’ చేశాడు.

READ:   ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల డేట్స్ ఇవే - All Time Report
-->

 కోట్లు పెట్టి కొన్న సినిమా వేరే హీరోకు

కోట్లు పెట్టి కొన్న సినిమా వేరే హీరోకు

‘అల.. వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ ‘సోనూకి టిటు కి స్వీటీ’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరిగింది. కానీ, అతడు సుకుమార్‌తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కూడా పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు. దీంతో కోట్లు పెట్టి కొన్న ఈ సినిమాను వేరే హీరోతో చేయించాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడని తాజాగా ఓ వార్త లీక్ అయింది.

READ:   హాట్ టాపిక్: మహేశ్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఒకే ఒక్క సినిమాతో రూ. 82 కోట్లు సంపాదన.!
-->

‘సోనూకి టిటు కి స్వీటీ' గురించి

‘సోనూకి టిటు కి స్వీటీ’ గురించి

2018లో బాలీవుడ్‌లో విడుదలైన చిత్రమే ‘సోనూకి టిటు కి స్వీటీ’. రంజన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, సన్నీ సింగ్, నుష్రత్ భరూచా కీలక పాత్రలు చేశారు. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ ఇది రూ. 150 కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమాను తమ తమ భాషల్లోకి తెరకెక్కించేందుకు చాలా మంది రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.