ఆటో ఇమ్యూన్‌ సమస్యకు అద్భుత వైద్యం

Spread the love

• ఆటో ఇమ్యూన్‌ సమస్యకు అద్భుత వైద్యం
నేటి ఆధునిక జీవనం కీళ్లపైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ల జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ల జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికీ తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడటం వల్ల కీళ్లు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకు రావొచ్చు. అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్లు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది.

 

* నడవడమే కష్టం.. ఎందుకంటే..
కీళ్లలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్లు లేదా ఇతర కీళ్ల భాగం విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్లు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం సంప్రాప్తించే ప్రమాదం వుంది. కీళ్ల అరుగుదల, నష్టం ఎక్కువైన తరువాత కీళ్ల కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్ని రకాల పనులు చేయలేము. కూర్చోని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది.
* ఎందుకా వాపు మరియు కీళ్లలో జరిగే మార్పులు
కీళ్లు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్‌ కార్టిలేజ్‌ అంటారు. కీళ్ల సమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్‌ కార్టిలేజ్‌ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్లు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్‌ పలుచబడి, సాగి, ముడతలు పడుతుంది. కీళ్లు భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడతాయి. ఫలితంగా కీళ్ల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్తసరఫరా జరుగుతుంది. ఈ మార్పు వల్ల ఆస్టియోఫైట్స్‌ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్‌ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్లు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ల లోపలి ద్రవం సన్నని రంధ్రాలు ద్వారా ఎముకల మధ్యకు వెళ్లి గుట్టలుగా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకలోని ట్రాబెక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్లు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది.
* ఆపరేషన్‌ లేకుండా.. హోమియోనందు ఎటువంటి చికిత్స ఉంది?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ద్వారా ఏ కారణం వ్లల కీళ్లు దెబ్బతిన్నాయో, వ్యాధి ఏ రకమైనది అనే విషయాన్ని నిర్ధారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ల నొప్పులు ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్‌ తగ్గాలంటే కీళ్ల మార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కానీ ఆపరేషన్‌ లేకుండా ఈ జబ్బును తగ్గించగల మందులను అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్‌ఫెక్షన్లు వంటి ట్యాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించటంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ తొలిదశ లోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో వుంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్‌ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

Also READ:   DRINKING HABBIT TO STOP: NO ADDICTION

Updated: March 15, 2019 — 10:19 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *