ఆహారం

ఆహారం

ముందు చూపుతో రూపొందించిన జీవన విధానానికి దూరం గా జరిగినందునే భారతీయులు అనారోగ్యాలకు గురవుతున్నారు . తిరిగి తమ జీవన విధానాన్ని , ఆహారపు పద్దతులను , ఆహారపదార్ధాల విషయం లో పట్టింపులను వెనక్కు తెచ్చుంటే తప్ప జీవిత కాలాన్ని ఎవరు మెరుగు పరుచుకోలేరు .

టిప్స్ :
1 . మన శరీరం లో తయారయ్యే రసాయనాల వల్ల కణాలు దెబ్బతింటాయి . చర్మము మీద ముడతలు రావడం , చర్మం కాంతిని కోల్పోవడం వంటివన్నీ ఆ రసాయనాలు తీసుకువచ్చే మార్పులే . కాబట్టి అటువంటి రసాయనాలను నిలువరించే యాంటి ఆక్షిడెంత్స్ ను శరీరానికి అందించాలి . యాంట్ ఆక్షి డెంత్స్ (AtiOxidents) ఎక్కువగా ఉన్నా ఆహారము తీసుకోవల్లి . బాసం , నిమ్మ , బత్తాయి , క్యారెట్లు , ఆకుకూరలు , టమాటోలు , రంగు మిరపకాయలు , వంటివి ఆహారము లో ప్రతి రోజు భాగం గా చేసుకోవాలి .

2. సలాడ్లు అనగా పచ్చి కాయకురకాయల ముక్కలు , పండ్లు ముమ్మలు , టమాటో ముక్కలు , క్యారట్ ముక్కలు సలాడ గా చేసుకొనే తింటే మంచిది . పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది కావున విరోచనం సాఫీగా అవుతుంది . విటమిన్లు , మినరల్స్ ఉంటాయి .

Related:   వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం—ఆయుర్వేద చికిత్స

3. ఇంట్లో పండ్లు నిలువ ఉంచుకోవాలి , భోజనానికి … భోజనానికి మధ్యలో శక్తి కోసం పండ్లు తినాలి . ఒక్కో ఋతువులో ఒక్కో రకం పండు లభిస్తాయి. అవి తినడం ఎంతో మంచిది .

4 . బలం గా , ద్రుడం గా ఉండాలంటే గట్టి ఎముకలున్డాలి .. చక్కని ఎముకలు , దంతాలు ఉన్నవారు ఆకర్షణీయం గా ను ఆరోగ్యం గాను కనిపిస్తారు … అటువంటి బలాన్ని అందించేవి పాలు , పాల ఉత్పత్తులు ప్రతి రోజు తీసుకోవాలి .

5 . అల్ఫారం గురించి ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు .. రాత్రి ౯ గంటలకు భోజనం చేస్తే తిరిగి ఉదయం ౭ గంటల వరకు ఆహారం లేకుండా ఉంటుంది శరీరం . అటువంటి శరీరానికి మధ్యలో అలపాహారం అందిస్తే మంచిది , వారి ,గోధుమ , మినప , పెసర లతో చేసే టిఫిన్లు తింటే మంచిది .

6 . ఆహారపదార్ధాలు తీసుకునేటపుడు ఎక్కువ పోషక పదార్ధాలు , పీచు ఎక్కువగా ఉండేటట్లు చూడాలి . పీచు పదార్ధము వల్ల రక్తం లోని కొలెస్టిరాల్ తగ్గుతుంది , షుగర్ స్థాయి తగ్గుతుంది , పెగుఅలకు సంభండిచి న క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది .

Related:   ​ఆకుకూరలు మరియు వాటిలో ఔషధ గుణాలు  - 3

7. ఆహారము తీసుకునే తప్పుడు మితిమీరి తినకూడదు … కొంత ఆకలిగానే భోజనం ముగించాలి . భోజనానికి ,భోజనానికి మధ్య కనీసం ౩-౪ గంటలు వ్యవధి ఉండాలి . ఆరోగ్యానికి మంచిది .

8 . కొవ్వు పదార్ధాలు ఉన్నా ఆహారము పరిమితం గా తీసుకోవాలి . కొవ్వు శరీరానికి అవసరమే కాని … కొవ్వు ఎక్కువగా చేరిన శరీమము అనేక రోగాలకు దారితీస్తుంది . అందుకే కొవ్వుపదార్ధాలు అతి తక్కువగా తినాలి . తీపి పదార్ధాలు , వెన్న , జున్ను , జంతు మాంసాలు ఎక్కువగా తినకూడదు . చేపలు , పిట్ట(పక్షి) మాంసము తినవచ్చును .

9 . పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది . ప్రతిరోజూ పండ్లు మార్చి మార్చి రకరకాల పండ్లు తినాలి .

10. తాజా కూరగాయలు తినడానికి ఎంచుకోవాలి . కూరలు వందే టపుడు మసాల వస్తువులు తక్కువగా వాడాలి .

11. నీరు ఎక్కువగా తాగాలి . దాహం వేసే తపుడే నీరు తాగడం కాదు . మధ్య మధ్య లో కావాలని నీరు తాగాలి . కడుపు ఖాళీ గా ఉన్నప్పుడే ఎక్కువ నీరు తాగితే చాలా మంచిది . ఆహారము ముందు నీరు తాగం వలన తక్కువ భోజనం చేయడం జరుగుతుంది .. మిత ఆహారము ఆరోగ్యానికి చాలా మంచిది . భోజనం తరువాత నీరు తాగాలి … నీరు జీర్ణక్రియకు తోడ్పడుతుంది .

Related:   మధుమేహులు - జాగ్రత్తలు

12. భోణం తిన్న వెంటనే పడుకోకూడదు … పది నిముషాలు అటు ఇటు నడవాలి . టీవీ చూస్తూ తినకూడదు ఎందుకంటే మనకు తెలియకుండానే ఎక్కువగా తేనె అవకాశముంది కనుక . ఒకవేళ టీవీ ముందు తింటే ముందే ఆహారము కొలపెట్టి వడ్డించుకోవాలి ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *