ఆ సమయంలో చిరాగ్గా ఉంటోంది

Spread the love

• ఆ సమయంలో చిరాగ్గా ఉంటోంది!
నాకు 26 ఏళ్లు. ఆరునెలల కిందట పెళ్లైంది. ఈ మధ్య లైంగిక చర్యలో పాల్గొంటుంటే.. వెంటనే మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. ఒక్కోసారి ఆపుకోలేక పడక గది నుంచి బాత్రూమ్‌ వెళ్లిపోతున్నాను. దీనివల్ల ఆయన చాలా అసంతృప్తికి గురవుతున్నారు. ఇద్దరిలోనూ చికాకు పెరుగుతోంది. రానురాను లైంగిక చర్య అంటేనే భయం వేస్తోంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి?

– ఓ సోదరి
పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రం వచ్చే మార్గం చాలా చిన్నగా ఉంటుంది. చెప్పాలంటే అది జననాంగాలకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. మీ సమస్య కూడా అదే. ఒకసారి ఈ సమస్య ఎదురయ్యాక నివారించడం మంచిది. లేదంటే అది ఏళ్ల తరబడి కొనసాగుతుంది. మీరు వైద్యుల్ని సంప్రదిస్తే మూత్రపరీక్ష చేసి అవసరమై మందుల్ని సూచిస్తారు. వాటిని వాడటంతోపాటూ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మంచినీళ్లతోపాటూ ద్రవపదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. బాత్రూంకి వెళ్లాలనుకున్నప్పుడు వెళ్లాలి తప్ప ఆగకూడదు. అలాగే కలయికకు ముందు కూడా తప్పనిసరిగా బాత్రూంకి వెళ్లడం మంచిది. ద్రవపదార్థాల్లో క్రాన్‌బెర్రీ జ్యూస్‌ కూడా ఉండేలా చూసుకుంటే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ చాలామటుకూ అదుపులో ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్తులో మూత్రపిండాల సమస్య ఎదురుకావచ్చని మరవకూడదు. కాబట్టి మీరు ఆలస్యం చేయకపోవడమే మంచిది.

Also READ:   Spinning Pom – Because A Spinning Pom Is A Happy Pom

Updated: April 13, 2019 — 2:45 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *