ఈ పండు తింటే కిడ్నీలో కంకర రాయి ఉన్నా కరగాల్సిందేనట

?
ఈ పండు తింటే కిడ్నీలో కంకర రాయి ఉన్నా కరగాల్సిందేనట!!

కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు సహజ పద్ధతిలో పోగొట్టుకునేందుకు పదుల సంఖ్యలో మార్గాలున్నాయి. అయితే జ్వరం, జలుబులతో సహా అన్నిటికీ హాస్పిటల్ కు వెళ్లినట్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు సైతం డాక్టర్ వద్దకే వెళ్తుంటారు. అల్లోపతి వైద్యులు కిడ్నీల్లో రాళ్ల సమస్యకు ఆపరేషన్ ఒక్కటే పరిష్కారం అనేట్టుగా వ్యవహరిస్తారు. కాని మన ఇంట్లోని పదార్థాలతోనే ఎలా పోగొట్టాలో తెలుసుకునే ముందుగా అసలు కిడ్నీలోకి రాళ్ళు ఎలా ఏర్పడతాయి అనే విషయంపై అవగాహన ఉంటే మంచిది. మనం రోజూ తినే ఆహారంలో ఇదొక వేస్ట్.. అంటే చిన్న చిన్న వెంట్రుకలు, కంటికి, పంటికి ఆనని ఇసుక, దుమ్ము, దూళి లాంటి పదార్ధాలు మనకు తెలియకుండానే మన నోటి ద్వారా పంపిస్తూ ఉంటాం. అలా వెళ్లిన ఆయా పదార్థాలు కిడ్నీల్లో వడపోత సమయంలో వాటిల్లో పేరుకుంటాయి. అలా అవి ఉండలా మారతాయి. అవన్నీ ఒక చోట చేరి ఒక చిన్నపాటి రాయిలా ఏర్పడతాయి. వీటినే మనం కిడ్నీలో ఉండే రాళ్ళు అంటాం. ఇదే మీకు సైన్స్ పరంగా చెప్పాలి అంటే ప్రతిరోజు మూత్రపిండాలు నీరు, రక్తం కలిపి కనీసం 600 నుంచి 700 లీటర్ల ద్రవాలను వడపోస్తూ ఉంటాయి.

Related:   మధుమేహం ఉంది * మామిడిపండు తినొచ్చా?

ఈ క్రమంలో వ్యర్ధపదార్ధాలన్నీ విసర్జింపబడతాయి. మధుమేహం ఉన్నవారిలో ఈ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం, పాస్ఫేట్లు, ఆక్సలేట్లు, మెగ్నీషియం, యూరియా ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ అవసరానికి మించి ఇవి ఉంటే.. ఇవే అతిచిన్న స్పటికాలుగా మారతాయి. కొన్నిసార్లు ఒకే ఒక స్పటిక కూడా రాయిగా మారవచ్చు లేదా కొన్ని కలసి రాయిగా మారతాయి. కొంతమందిలో విటమిన్ A, D లు ఎక్కువగా ఉన్నా విటమిన్ B కాంప్లెక్స్ తక్కువగా ఉన్నా రాళ్ళూ ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాళ్ళూ ఏర్పడడానికి ఒక యూరిక్ యాసిడ్ ఒక బలమైన కారణంగా కూడా చెప్పొచ్చు. అలాగే మాంసాహారుల్లో రాళ్ళూ ఎక్కువగా ఏర్పడతాయి.

థైరాయిడ్ సమస్య కారణంగా ఎక్కువగా వేసుకునే మందులు, గ్యాస్టిక్ సమస్యల కారణంగా తీసుకునే జలసిస్ లాంటి ద్రవాలు కూడా రాళ్ళు తయారవడానికి కారణం అవుతాయి. ఈ ద్రవాలల్లో కాల్షియం ఉండడం వల్ల రాళ్ళు ఏర్పడుతుంటాయి. దాదాపు పది శాతం రాళ్లు దీర్ఘకాలిక సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి తీసుకునే మందులవల్లే ఏర్పడతాయి. రోజూ మద్యపానం చేసే వారిలో కూడా ఈ సమస్యలు కనబడుతుంటాయి. వీటన్నింటికీ మించి అవసరమైన నీళ్లు తాగకపోవడం వల్ల రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఆహారంలో రసాలు, పులుసులు ఇవేమి లేకుండా పూర్తిగా ఘనాహారమే తీసుకుంటే వారిలో కూడా ఈ కిడ్నీ రాళ్ల సమస్యలు వస్తాయి.

Related:   మధుమేహులు - జాగ్రత్తలు

కిడ్నీలో ఉండే రాళ్లను తీసేయడం ఎలా? కిడ్నీలో రాళ్లను కరిగించుకోడం సాధ్యం కానీ.. మీకు ఓ విషయం తెలియాలి. అదేంటంటే రాళ్లు 5 మి.మీ. కంటే తక్కువ ఉంటే తప్ప వాటిని కరిగించలేము. 5 నుంచి 7 మి.మీ. ఉన్నవాటికి ఆపరేషన్ చేసి తియ్యాలి. ఇక కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు నొప్పి వస్తుంది. ఇది చాలా మందికి అనుభవం ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. లేకపోతే పెద్ద ప్రమాదమే ఉంటుంది. ఇక కిడ్నీలో రాళ్ళూ కరిగించాలకుంటే మన ఇంట్లోనే చాలా సహజ మార్గాలున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

అందరూ చెప్పేది ఒకటే ఎక్కువగా నీరు తాగాలి. శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడతాయి. మీకు గాని రాళ్ళూ ఉన్నాయని తెలిసిన వెంటనే ఎక్కువగా నీరు, ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 5 నుంచి 6 లీటర్ల నీరు తప్పనిసరి. కిడ్నీలో రాళ్ళూ కరిగించడానికి ఇది చక్కని చిట్కా. మరొకటి మెంతులు నీటిలో నానబెట్టి తీసుకోవడం. ఒక స్పూన్ మెంతులు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే కిడ్నీలో రాళ్లు పోతాయి. అంతేకాకుండా శరీరంలోని విష పదార్ధాలను కూడా ఈ ద్రవం బయటకు పంపిస్తుంది. అరటిచెట్టు బెరడు. ఇది నిజానికి ఒక కూరలాగా వండుతారు. అరటిచెట్టు కాండంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని కనుక తీసుకుంటే మూత్ర ద్వారం గుండా రాళ్లను బయటకు పంపిస్తుందనే నమ్మకం గట్టిగా ఉంది.

Related:   రాళ్ల ఉప్పు

మరొకటి కొత్తిమీర ఆకులు. సాధారణంగా కొత్తిమీరను గార్నిష్ గా ఉపయోగిస్తాం. కానీ, దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒక నీటి గిన్నెలో కొత్తిమీర ఆకులు తీసుకుని కాచుకోవాలి. తరువాత ఆ నీటిని తాగాలి. ఇంకో బెస్ట్ టిప్ ఏంటంటే నేరేడు పండు. ఈ పండు దొరికే సీజన్లో రోజుకు ఒకటి చొప్పున తిన్నాసరే కిడ్నీలో కంకర రాళ్ళు న్నా యిట్టే కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు. కడుపులో ఉండే వెంట్రుకలు, చిన్నపాటి రాళ్లను పూర్తిగా కరిగించే శక్తి ఈ పండుకు ఉంది. కాబట్టి నేరేడు పండ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. మూత్రపిండాలలో రాళ్లను శస్త్రచికిత్స నుండి మి నవీన్ నడిమింటి తప్పించుకోవాలి అంటే ఈ సులభమైన పరిష్కారాలు తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *