ఈ రోజు స్పెషల్ అరటి కాయ పచ్చడి

ప్రియమిత్రులందరికీ

ఈ రోజు స్పెషల్ అరటి కాయ పచ్చడి .

అరటి కాయ పచ్చడి .

తయారు చేయు విధానము .

కావలసిన వస్తువులు .

అరటి కాయలు —- 2
పెద్ద ఉల్లిపాయలు —- 2
పచ్చిమిరపకాయలు —– 4
కరివేపాకు —– 3 రెమ్మలు
కొత్తిమీర —– మరి కాస్త ఎక్కువ .

పోపు వేయుటకు — నూనె 3 టీ స్పూన్లు .
ఎండు మిరపకాయలు — 5
చాయ మినపప్పు — 2 స్పూన్లు
ఆవాలు —- 1 స్పూన్
ఇంగువ — తగినంత
పసుపు — కొద్దిగా
ఉప్పు —- తగినంత .

అరటి కాయ పచ్చడి తయారు చేయు విధానము .

ముందు ఉల్లిపాయలు పై పొట్టు తీసి చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరగండి.

( ఎలాగంటే దోశెలలోకి మరియు మిర్చి బజ్జీలలోకి సన్నగా తరుగుతాము కదా . ఆ విధంగా )

Related:   ఆవకాయ. ( ఏడాది ఊరగాయ )

ఇప్పుడు అరటికాయలు శుభ్రంగా కడిగి పొడిగా గుడ్డ పెట్టి తుడవండి.

అరటి కాయల చెక్కు తీయవద్దు.

ఇప్పుడు స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టండి.

అరటికాయలు మీద నూనె రాయనక్కరలేదు .

ఆ రెండు అరటి కాయలు వంకాయలు రోటి పచ్చడికి కాల్చినట్లు కాల్చండి .

పై చెక్కు నల్లగా అయి చేతితో పట్టుకొని చూస్తే లోపల మెత్తగా అవుతుంది .

గిన్నెలో నీళ్ళు పెట్టుకుని చేతులు తడి చేసుకుంటూ ఆ కాయల పై చెక్కు తీసేయండి .

ప్లేటులో ఆ కాయలు ఉంచుకోండి.

ఇప్పుడు స్టౌ మళ్ళీ వెలిగించి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక అందులో చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి పోపు బాగా వేగాక అందులో కరివేపాకు , పచ్చిమిరపకాయలు వేసి రెండు నిముషాలు ఉంచి స్టౌ ఆపేయండి .

Related:   అశోకా హల్వా

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించవద్దు .

పోపు చల్లారాక ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు , పసుపు కొద్దిగా వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి.

మిగిలిన పోపు ఇప్పుడే వేయవద్దు.

తర్వాత మిక్సీ లో కాలిన అరటి కాయలు ,పచ్చి మిరపకాయలు ,
వేగిన కరివేపాకు వేసి మరోసారి మిక్సీ వేసుకోండి.

అరటికాయలు బాగా కాలి ఉంటాయి కాబట్టి కొద్దిగామిక్సీ వెస్తే చాలు పచ్చడి మెత్త పడుతుంది .

ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన పోపు , కొత్తిమీర సన్నగా తరిగి చేత్తోనే బాగా కలుపుకుని ఒక Bowl లోకి తీసుకోండి.

అంతే పసందైన అరటి కాయ పచ్చడి భోజనం లోకి సిద్ధం.

Related:   సంక్రాంతి  స్పెషల్  వంటలు - మైసూర్ పాక్ 

ఇందులో ఉల్లిపాయలు పచ్చివి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది .

వేగిన మినపప్పు పంటి కింద తగులుతూ చక్కని రుచితో ఉండే ఈ అరటి కాయ పచ్చడి తప్పక try చెయ్యండి.

మీ అందరికీ నచ్చుతుంది .

ఈ పచ్చడికి పండిన , ఓ మాదిరిగా పండిన అరటి కాయలు వాడవద్దు .

పచ్చడి తీపి వచ్చి రుచి పాడవుతుంది .

పచ్చి కాయలే వాడండి .

ఫోటో — ఈ రోజు మేము చేసిన అరటికాయ పచ్చడి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *