ఉల్లిపాయ  పులుసు

Spread the love

ఉల్లిపాయ  పులుసు.
ఉల్లిపాయలు  —  పావు కిలో లేదా 4

చింతపండు  —  30 గ్రాములు. లేదా  నిమ్మకాయంత.

బెల్లం  —  30 గ్రాములు .

పచ్చిమిర్చి  —  4

కరివేపాకు  —  మూడు రెమ్మలు

పసుపు   —  కొద్దిగా

ఉప్పు  —  తగినంత

కొత్తిమీర  —  కొద్దిగా

బియ్యపు పిండి  —  స్పూను
పోపుకు .
ఎండుమిరపకాయలు  –  4

ముక్కలుగా  చేసుకోవాలి .

నూనె  —  మూడు స్పూన్లు

మెంతులు  —  పావు స్పూను

Also READ:   కడై చోలే

జీలకర్ర  —  పావు స్పూను

ఆవాలు —  అర  స్పూను

ఇంగువ  —  కొద్దిగా
తయారి విధానము .
ముందుగా  స్టౌ మీద  గ్లాసున్నర నీళ్ళు పోసి నీళ్ళు మరిగాక చింతపండు  వేసి  దింపి  చల్లారాక  చిక్కగా  రసం తీసుకోవాలి .
ఉల్లిపాయలు కాస్త  పెద్ద ముక్కలుగా  తరుగు కోవాలి .
పచ్చిమిర్చి  నిలువుగా  తరుగుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు  వేసి పోపు వేగాక  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు, పచ్చిమిర్చి  ముక్కలు  కూడా  వేసి మూతపెట్టి  ముక్కలను   బాగా మగ్గనివ్వాలి .
ముక్కలు  మగ్గగానే  రెడీగా  ఉంచుకున్న  చింతపండు  రసం, పసుపు , ఉప్పు , బెల్లం  కూడా  వేసి  పదిహేను నిముషాల సేపు  బాగా  తెర్లనివ్వాలి .
తర్వాత అర గ్లాసు నీళ్ళలో  స్పూను  బియ్యపు  పిండి  వేసి  స్పూనుతో  బాగా కలిపి  మరుగుతున్న పులుసు లో పోసి మరో అయిదు నిముషాలు  ఉంచి  దింపుకుని  పైన కొత్తిమీర  వేసుకోవాలి .
అంతే  ఘమ ఘమ లాడే  ఉల్లిపాయ  పులుసు  సర్వింగ్  కు  సిద్ధం.

Also READ:   వంకాయ కాల్చి పెరుగు పచ్చడి

Updated: March 17, 2019 — 2:46 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *