ఉసిరి ఆవకాయ . ( నిల్వ ఊరగాయ )

ఉసిరి ఆవకాయ . ( నిల్వ ఊరగాయ )

కావలసినవి .

పెద్ద ఉసిరి కాయలు — రెండు కిలోలు.
ఎండు కారం — 400 గ్రాములు.
ఆవపిండి — 350 గ్రాములు
ఉప్పు మెత్తనిది – 300 గ్రాములు
పసుపు — రెండు స్పూన్లు
ఎండుమిరపకాయలు – 15
నూనె — 600 గ్రాములు
ఆవాలు — మూడు స్పూన్లు
ఇంగువ — స్పూను.

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే ఉసిరికాయలు వేసి మూత పెట్టి పది హేను నిముషాలు పాటు మగ్గనివ్వాలి .

Related:   30 DELICIOUS 5-MINUTE RECIPES

తర్వాత మూత తీసి మరో అయిదు నిముషాలు నీరు తడి లేకుండా ఇగర నివ్వాలి .

తర్వాత మగ్గ పెట్టి సిద్ధంగా ఉంచుకున్న కాయలపై పై పసుపు, కారం , ఆవపిండి , మెత్తని ఉప్పు ఒక బేసిన్ లో వేసి నాలుగు మూలలా చేతితో బాగా కలుపు కోవాలి .

మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన మొత్తము నూనె వేసి నూనెను బాగా కాగనివ్వాలి .

బాగా కాగిన నూనెలో ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ ( మరి కాస్త ) వేసి పోపు వేగాక చల్లారనిచ్చి ఆ నూనెను ముక్కల లో పోసి గరిటతో బాగా కలుపుకోవాలి.

చల్లారగానే ఒక జాడి లోకి తీసుకోవాలి .

Related:   సాంబార్

వాడుకునే టప్పుడు చిన్న గిన్నెలలోకి అవరమైన పచ్చడి తీసి వాడుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది .

అంతే ముక్కుపుటాలు అదిరిపోయే ఇంగువ వాసనతో ఉసిరికాయతో ఆవకాయ సర్వింగ్ కు సిద్ధం.

ఈ పచ్చడి నాలుగు నెలల పైన నిల్వ ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *