ఊబకాయం తరి‘మేను’..! * ఏరోబిక్స్‌ సాధనతో సత్ఫలితాలు

0
99

• ఊబకాయం తరి‘మేను’..!

* ఏరోబిక్స్‌ సాధనతో సత్ఫలితాలు

కుటుంబపరంగా వర్తించే జన్యువులవల్ల లేదా తినే ఆహార అలవాట్ల ద్వారా కొందరు అధిక శారీరక బరువుతో బాధ పడుతుంటారు. శరీరం రోజురోజుకూ పెరిగిపోతూ వంద కిలోల బరువును దాటిపోయి అటు శారీరకంగా, ఇటు మానసికంగాను కుంగిపోతుంటారు కొందరు. అధిక శారీరక బరువును తగ్గించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. నడక, సైకిల్‌ తొక్కడం, వ్యాయామం చేయడం వంటి పలురకాల విధానాలను నిత్యం చేస్తున్నప్పటికీ రెండు మూడు కిలోల కంటే బరువు తగ్గే పరిస్థితి ఉండదు. ఊబకాయులు అధిక శారీరక బరువును తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి వారి కోసం ప్రత్యేకమైన సాధనతో కూడిన విధానాలున్నాయి. దానిపేరే ‘ఏరోబిక్స్‌’. మితాహారాన్ని తీసుకుంటూ లయబద్ధంగా శరీరాన్ని కదిలించడం ద్వారా శారీరక బరువును తగ్గించుకోగలుగుతున్నారు. ఏలూరు వంటి నగరాల్లో ఇటువంటి శిక్షణ కేంద్రాలు ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి.

Also READ:   What is Weakness

* శిక్షణ..శారీరక సంరక్షణ.. పోషణ

ఈ శిక్షణ కేంద్రాలకు వచ్చేవారికి ముందుగా ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బీఎంఐ) పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే కొలమానాలు, సదరు వ్యక్తుల శారీరక సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని శరీర బరువును తగ్గించడానికి అనువైన పద్ధతులపై శిక్షణ తరగతుల ద్వారా కేంద్రాల నిర్వాహకులు వివరిస్తారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం వేళల్లో తీసుకోవల్సిన ఆహార పదార్థాలను కొలమానాలతో సహా తెలియజేస్తారు. కేవలం కాయగూరలనే కాకుండా మాంసాహారాన్ని కూడా తినవచ్చని శిక్షకులు చెబుతున్నారు. అయితే వాటి మోతాదు చాలా తక్కువగా ఉండాలని అంటున్నారు.

Also READ:   రాత్రిపూట దగ్గు?దగ్గు వదిలించుకోవడానికి మరియు గాఢంగా నిద్ర పొందడానికి మార్గాలు ఇక్కడ ఉన్నాయి!

* లయబద్ధంగా నృత్యం

శారీరక బరువును తగ్గించుకోవడానికి ఆహార నియమాలను పాటించడంతోపాటు లయబద్ధంగా శరీరానికి అలసట కల్పించడం ఎంతో అవసరమని కేంద్రాల నిర్వాహకులు అంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో 45 నిమిషాలపాటు ఏరోబిక్స్‌ చేయడం ద్వారా శరీరానికి అలసట కలిగేలా చేస్తున్నారు. ఈ సమయంలో శ్రావ్యమైన సంగీత సాధనాలను వినియోగిస్తున్నారు.

* మూడు మాసాల్లో బరువు తగ్గా…!

ఏరోబిక్స్‌ శిక్షణ ద్వారా కేవలం మూడు మాసాల్లోనే కొంత బరువును తగ్గించుకోగలిగాను. 123 కిలోల శారీరక బరువుతో నేను చాలా ఇబ్బందులు పడేవాణ్ని. ప్రస్తుతం నా ఆహార నియమాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో నడక, వ్యాయామం చేసినా నా బరువు ఏమాత్రం తగ్గలేదు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఏరోబిక్స్‌ చేయడం ద్వారా తెలియని ఉత్తేజం వస్తోంది.
– పి.నాని, ఏలూరు మండలం,
పైడిచింతపాడు గ్రామం

Also READ:   పొట్ట కరిగించే 15 మార్గాలు

* అనారోగ్య సమస్యలు దూరం

95 కిలోల బరువుతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చిన్నతనం నుంచి ఊబకాయం ఉండటంవల్ల పాఠశాలకు వెళ్లడానికి కూడా భయపడ్డాను. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నోరకాల విధానాలను అనుసరించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లభించలేదు. ఏరోబిక్స్‌ చేయడం ద్వారా 20 కిలోల వరకు బరువు తగ్గించుకోగలిగాను. బరువు తగ్గాక అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోయాయి.
– పి.నాగవేణి, ఏలూరు