ఏంతినాలి ? ఎలా తినాలి ?భగవద్గీత ఏమి చెపుతున్నది?

Spread the love

ఏంతినాలి ? ఎలా తినాలి ?

భగవద్గీత ఏమి చెపుతున్నది?

….మనం బ్రతకడానికి తింటాం!
మనలోకొందరు తినడానికేబ్రతుకుతారు

.

ఏం తినాలి ఎలా తినాలి?

.

మనం తీసుకునే ఆహారం మనమీద ఏం ప్రభావం చూపుతుంది!

.

మామూలుగా చూడండి

.

కాయగూరలు,తియ్యని పదార్ధాలు పాలు,నెయ్యి ఇలాంటివి తినేవారు సత్వగుణం కలిగి ఉంటారు!

.

చేదుగలవి,పులుపుగా ఉన్నవి బాగా కారం మసాలాలు, రకరకాల రుచులు కావాలనుకొనేవారు రాజస స్వభావం కలిగివుంటారు! కస్సున లేస్తూ ఉంటారు!

.

ఉడికీ ఉడకక బాగా పులిసిపోయి ఎక్కడబడితే అక్కడశుభ్రత లేని వాతావరణంలో తినేవారిలో తామస లక్షణాలుంటయి!(పుల్లట్లు చాలా మందికి ఇష్టం !అవి తిన్నరోజు ఆవలింతలు ఎక్కువ వస్తాయి గమనించారా!)

Also READ:   పొట్ట రాకుండా

.

మనం తినే ఆహారం మన mood నిర్ణయిస్తుంది అని చాలా పరిశోధనలు మనకు తెలియచేసాయి!

.

అసలు మనం ఎన్నిసార్లు బోజనం చేయాలి?

.

దీనికి సూర్యుని తో ముడిపెట్టారు మన పెద్దలు!

యామమధ్యే న భోక్తవ్యం

యామయుగ్మం న లఙ్ఘయేత్…

.

ఒక యామం అంటే 3 గంటలు!

రోజుకు ఎనిమిది యామాలు! సూర్యోదయం నుండి యామాలు లెక్క!

.

అంటే మొదటి యామం అయిన తరువాత భోజనం చేయాలి!

అంటే సూర్యోదయం 5.30 అనుకోండి 8.30 నుండి 11.30 లోపు భోజనం చేయాలి!..

.

మనం తిన్న భోజనం అరగటానికి కనీసం ఆరుగంటలు సమయంకావాలి!

Also READ:   PaleoQue - Competition Quality Paleo BBQ for the Paleo Diet & Keto Diet

.

అందుకే సూర్యాస్తమయం అయిన మూడుగంటలలోపు భోజనం ముగించేయాలి!

.

రోజుకు రెండుసార్లు మాత్రమే! భుజించాలి!

.

తినడానికి మాత్రమే పుట్టిన ఈకాలంలో సాధ్యమవుతుందా!

.

అవ్వదు !

.

అందుకే ఇన్ని corporate hospitals ఇన్ని medical insurance కంపెనీలు!

.

కాలాన్ని బట్టికూడా ఆహారం నిర్ణయించారు!

.

ఉదాహరణకు శీతాకాలంలో చాలా తక్కువ భుజించమంటారు!

.

“యమదంష్ట్ర ” అని ఒక సమయం ఉన్నది .

.

అది కార్తీకమాసపు చివరి ఎనిమిదిరోజులు మార్గశిరమాసపు మొదటి ఎనిమిది రోజులు కలిసిన కాలం అన్నమాట!

.

ఈ పదహారు రోజులు ఎంత తక్కువ తింటే అంత మంచిదట!

.

…గీతాచార్యుడయిన కృష్ణుడు ఏంచెపుతున్నాడంటే!

..

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః

ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః

Also READ:   Erectile Dysfunction - End It!

చేదు,పులుపు,ఉప్పు,కారము,

బాగావేడి,మాడిన ఆహార పదార్ధములు దుఃఖ శోకమయములు .

ఇవి రాజస ప్రవృత్తికలిగిస్తాయి!

రాజస ప్రవృత్తి కలిగిన వారికి ఇవి ఇష్టము …..

.

హిత,మిత ఆహారం తీసుకోవాలి

ఏదయినా తిన్నది చక్కగా జీర్ణమవ్వాలి, దానిని”సమ్యఃకరణ” అంటారు.

.

జీర్ణంకాగా మిగిలినది బయటకు వెళ్లిపోవాలి ఇది “బహిష్కరణ”…

.

ఇవి చక్కగా ఉంటే ?

ఆరోగ్యం మన వెంటే!

..

కంజర్ల  హన్మంతరావు పంతులు

Updated: April 14, 2019 — 10:56 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *