ఒంటి మిట్ట రామాలయం

0
99

ఒంటి మిట్ట రామాలయం!

Please View My Other Sites

ఇది ఒంటిమిట్ట శ్రీ రామాలయం లో సుమారు 100 సంవత్సరాల కృతం బ్రిటిష్ దొరలు మనల్ని పాలిస్తున్న రోజుల్లో జరిగిన యదార్థ సంఘటన కి కధా కల్పన. ఆ రోజుల్లో ఆ రామాలయం కి అంత రద్దీ ఉండేది కాదు..ఎప్పుడో ఒకరు ఇద్దరు వోచి వెళ్ళే వాళ్ళే..కానీ రామ దాసయ్య కి మాత్రమ్ రోజూ రామయ్య ని కలిసి రామయ్య సీతమ్మ కి ఇంత తనకు దోరకిన తిండి, అదీ ఎవరో దానము చేసింది తీసుకు వొచ్చి వారి ముందు పెట్టి తినమని పెట్టి తిన్నట్టు భావించి తను కూడ తిని కాసేపు కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవాడు. అతని చిరిగిన దుస్తులు, చింపిరి జుట్టు వాలకం చూసి పీచ్చోడు అనుకోనేవారు చాలమంది. చాలా కాలం ఇలా జరుగుతుంటే ఓ రోజు కడప జిల్లా ను పాలించే COLLECTOR ENGLISH దోరవారికి ఈ ఆలయం గురించి తెలిసి చూడాలని సంకల్పించారు. అంతే రాజు తలచుకొంటే దేనికి కరువు..ఇక క్రింద పనిచేసే ఉద్యోగుల హడావుడి చెప్పక్కర్లేదు..వెంటనే హుటాహుటిన ఆలయానికి బయల్దేరారు. ఆ రోజు రామ దాసయ్య కి ఆహారం ఎక్కడా దొరక లేదు..ఓ పక్కన ఎండ మండించేస్తోంది..ఆహారం దొరక లేదు. ఓ ముద్ద పెట్టే తల్లే కనబదదేమి. అయ్యో నా రామయ్య కి ఆకలేస్తోన్దో ఏమిటో? అసలే సుకుమరుడు. ఆపై సీతమ్మ తల్లి ఏడు మల్లెల ఎత్తు సుకుమారి. ఎంతో ప్రయత్నిస్తే సుమారు మిట్ట మద్యాహ్నం 2:30 కి కాసింత ముద్ద దొరికింది. ఇక క్షణం ఆలస్యం చెయ్యలేదు తను..పరుగు పరుగున ఎలా వొచ్చి పడ్డాడో ఆ రామయ్య కె తెలుసు..ఆలయం చేరేసరికే సుమారు సాయంత్రం 3 అవుతోంది..విస్తరి లో చుట్టి పట్టుకొచ్చిన అన్నము గబగబా స్వామి ముందు ఉంచి నీళ్ళు పట్టుకొచ్చే లోపల ఎప్పుడు వొచ్చేరో తెలీదు బిలబిలమంటూ COLLECTOR దొరగారి అధికారులు, బంట్రోతులూ వొచ్చి తనను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది గా ఆదేశించడం తరిమేయ్యడమ్ గుడి శుభ్రం చెయ్యడం ఇలా చక చకా చేస్తూ తను స్వామికి కనీసం ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఆరగిన్పు పెట్టనైన పెట్టనివ్వకున్దా గేన్తేయ్యడమ్ జరిగింది..రామదాసయ్య కన్నీరు మున్నీరుగా గా ఏడుస్తూ అయ్యో నా రామయ్య కి నోటి ముందు పెట్టిన కూడు లాగేసారే ఎంత బాధ పడుతున్నాడో నా చిట్టి తండ్రి, అది చూసీ నా సీతమ్మ మనసు ఎంత తల్లడిల్లిపోయిందో అని బరువెక్కిన గుండె తో ఆలయం వెనక బాగము నుంచి వెళ్ళి పోతున్నాడు విలపిస్తూ ఆ పిచ్చి భక్తుడు. తనని తరిమేసినన్దుకు కాదు తెచ్చిన ముద్ద నా స్వామి కి తినిపించలేక పోయానే అనే భాధ తట్టుకోలేకపోతున్నాడు. ఇది ఇలా ఉండగా దొర గారు సాయంత్రం వేళకి రానే వొచ్చేరు. పురోహితులు దోరగారికి పూర్ణ కుంభం తో స్వాగతం పలకడం, ఆలయం ముందు మంత్రాలు చదువుతూ ఓ సారి గుడి తలుపులు తీసి నిర్ఘాంతపోయారు.అది చూసీ COLLECTOR గారికి లోనికి తొంగి చూసి ఏమీ జరుగుతోందో కూడా తెలియక తికమక తో నోట మాట రావడం లేదు..ఇక చుట్టూ ఉన్న ఉద్యోగుల పరిస్తితి చెప్పక్కర్లేదు. దొరగారు ఇక ఉండబట్టలేక అడిగేసారు అదేంటి సీతా రాముల విగ్రహాలు ముందు వైపు వీపు చూపిస్తూ ఆలయం వెనుకకు చూస్తున్నాయి.అని..పూజారులు లేదు ప్రభూ ఈ రోజే ఇది జరిగింది ఎందుకో.స్వామి కి ఆగ్రహం కలిగింది. అసలు ఈ రోజు ఏం జరిగిందో సరిగ్గా తెలిస్తే గానీ అసలు దీనికి కారణమ్ భోధ పడదు అన్నారు. అంతా కలసి అనేక తర్జనభర్జనల తర్వాత రామదాసయ్య నైవేద్యం స్వామి కి పెట్టనీయకున్దా తరిమి వెయ్యడం అంతా గుర్తు తెచ్చుకొన్నారు. దాంతో తమ ఉద్యోగులు చేసిన నిర్వాకానికి దోరగారికి తీవ్ర ఆగ్రహం వొచ్చి వొళ్ళు మండి వారిని తిట్టి ఆ మహాత్ముడు మహా భక్తుడు ఎక్కడున్నా వెతికి ఎంతో గౌరవప్రదము గా తీసుకొని రమ్మని రాకుంటే తనే వెళ్ళి స్వయం గా తీసుకు రాదలిచానని చెప్పాడు. వెంటనే ఆ మహా భక్తున్ని తీసుకువచ్చి జరిగింది చెప్పి క్షమాపణలు కోరి పూజారులు చేసిన నైవేద్యాన్ని ఆయనకి ఇచి స్వామీని మీరే పిలవండి మామూలు గా అవుతారు స్వామి.మీరే మాచే ఆపబడిన నైవేద్యాన్ని స్వామీ కి తినిపించినాకే మేము ఆయన దర్శనం చేసుకొంటాము అన్నారు. రామ దాసయ్యకి జరిగింది ఓ కలలా ఉంది..నిజమా నా రామయ్యకి నేను తెచ్చిన నైవేద్యాన్ని పేట్టనివ్వలేదని ఇంత పని చేసాడా? ఆఖరికి ఎవ్వరికీ దర్శనము కూడా ఇవ్వకుండా అలిగి వెనక్కి తిరిగి నిలబడ్డారా నా రామయ్య సీతమ్మ లక్ష్మయ్యా..ఎంత సుకృతం..ఆనందభాష్పాలతో నిండిన కళ్ళు తుడుచుకొని స్వామీ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇక తిను అన్నాడు అంతే స్వామీ ఒక్కసారిగా దేవేరి, సోదరుడి తో కలసి ముందుకు తిరిగాడు. ముందు ఉంచిన నైవేద్యం లో ఒక్క మేతుకూ లేకుండా మాయమయ్యిన్ది..చూసావా నా స్వామి,తల్లి, లక్ష్మయ్యా ఎంత ఆకలితో ఉన్నారో అనుకొన్నాడు..స్వామీ సంతోషించి అందరికీ దివ్య మంగళ దర్శనము ఇచ్చాడు. COLLECTOR గారికి స్వామీ మహిమ భోధ పడింది. వెంటనే రామ దాసయ్య కు అక్కడే భోజన ,వసతి సౌకర్యాలు కల్పించి మొట్ట మొదటి ధర్శన నైవేద్య సేవా భాగ్యాన్ని కల్పించి సంతోషం తో తిరిగి ప్రయాణమయ్యాడు.

Also READ:   అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం – పళముదిర్చోళై