ఒక మంచి కథ…..చదవండి…నచ్చితేనే షేర్ చేయండి

♻✨♻✨♻✨♻✨♻

ఒక మంచి కథ…..చదవండి…నచ్చితేనే షేర్ చేయండి.
…..
ఒక వ్యక్తి రాత్రి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి ఏదో చప్పుడైతే
తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ ఒక దేవదూత కూర్చోని ఏదో
వ్రాసుకుంటూ ఉంది. ఆమె దగ్గరకి వెళ్ళి ” అమ్మా! ఏమి వ్రాస్తున్నారమ్మా!”
అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంది.
” దేవుడంటే ఎంతమందికి ప్రేమ భక్తి ఉన్నాయో తెలుసుకుని ఈ పుస్తకంలో
వ్రాస్తున్నాను. ” వెంటనే ఆతురతగా ఆ వ్యక్తి ఇలా అడిగాడు.
” మరి ఆ పుస్తకంలో నా పేరు ఉందా? ఒకసారి చూసి చెప్పమ్మా!”
బాగా వెతికి లేదని సమాధానం చెప్పింది ఆ దేవదూత…..
తనపేరు లేదని చెప్పగానే బాధపడకుండా నవ్వుతూ ఇలా అన్నాడు.
” నా తోటి మనుషులకు సహాయాన్ని అందిస్తూ ఉంటాను. మానవత్వం అనే
పుస్తకంలో నాపేరు ఖచ్చితంగా ఉండి ఉంటుంది ” అని అన్నాడు.
దానికి దేవదూత నవ్వుతూ వెళ్ళిపోయింది, మరుసటి రోజు ఆ దేవదూత
మళ్ళీ వచ్చింది. తన చేతిలో ఒక పుస్తకాన్ని కూడా తీసుకుని వచ్చింది.
ఆమె చేతిలోని పుస్తకాన్ని అలాగే చూస్తున్నాడు ఆ వ్యక్తి.
” ఏంటి తదేకంగా చూస్తున్నావు. ఇది దేవుడికి ప్రియమైన భక్తుల పేర్లు
ఉన్న పుస్తకం. దేవుడు నీకు చూపించి తీసుకుని రమ్మన్నారు. చూస్తావా? ”
అంది దేవదూత.
” తప్పక చూస్తాను తల్లీ! ” అని ఆతృతగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు
ఆ వ్యక్తి. పుస్తకాన్ని తెరిచి చూశాడు. ఆశ్చర్యంగా ఆ పుస్తకంలోని
మొదటిపేజీలో మొదటి పేరు తనదే ఉండటాన్ని గమనించాడు.
ఆనందంతో తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలసాగాయి.
మనం ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చామో ముందు తెలుసుకోగలగాలి.
తోటివారిలో దేవుడిని చూడగలగాలి….ఎదుటి వ్యక్తిని హింసించి…..చివరికి
చంపడానికి కూడా మనిషి వెనుకంజ వేయడం లేదు. కొందరైతే ఎదుటివారి
నాశనాన్ని దేవుడి దగ్గరికి వచ్చి మరీ వరం అడుగుతుంటారు.
దేవుడికి ఇష్టమైన వారిగా

Related:   స్నేహితురాళ్ళు

*మనం మారాలంటే మనలో కాస్త మానవత్వం*
*ఉంటే చాలు…వేలకు వేలు దేవుడికి సమర్పించక్కరలేదు. చేతనయినంతవరకు*
*ఇతరులకు సహాయాన్ని చేయండి. చేసిన సహాయాన్ని మరచిపోకండి
*దేవుడు గుర్తుపెట్టుకుని మిమ్మల్ని* *రక్షిస్తాడు*….

సమయానికి తగ్గట్టుగా
మనకు ఆశీస్సులు అందజేస్తాడు…
ఓం నమః శివాయ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *