ఓవర్సీస్‌లో మహేష్‌కు సరిలేరు.. ప్రీమియర్స్‌తోనే దుమ్ములేపేశాడు

0
23

Please View My Other Sites


తెలుగు రాష్ట్రాల్లో హవా..

భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు చేసి క్లాస్ లుక్‌లో కనిపించిన మహేష్.. మాస్ అవతారమెత్తి సరిలేరులో విజృంభించాడు. రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ స‌ృష్టించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 80 శాతం థియేటర్లలో విడుదల చేశారు. ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయింది సరిలేరు టీమ్.

Also READ:   66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో... సత్తా చాటిన ‘కేజీఎఫ్’
-->

ఓవర్సీస్‌లోనూ భారీ ఎత్తున...

ఓవర్సీస్‌లోనూ భారీ ఎత్తున…

ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించేందుకు ఇప్పటికీ ఎంతో మంది ప్రయత్నిస్తుండగా.. కేవలం ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లతో ఆ మార్క్‌ను అవలీలగా దాటేయనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి లెక్కల ప్రకారం దాదాపు 184 లొకేషన్లలో 3లక్షల డాలర్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం.. సరిలేరు ఏ మేరకు వసూళ్లు చేసిందో ఓ సారి చూద్దాం.

Also READ:   విజయ్ దేవరకొండ 'హీరో'.. అలా అనుకుంటే పొరపాటే మరి!

పదిహేనో స్థానంలో..

పదిహేనో స్థానంలో..

సరిలేరు చిత్రం ఇప్పటి వరకు దాదాపు హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు సమాచారం. దాదాపు 292 స్క్రీన్స్‌ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 7,59,120 డాలర్లను వసూళ్లు చేసినట్టు టాక్. అంతేకాకుండా.. భారతీయ చలన చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా పదిహేనో స్థానంలో నిలిచిందని తెలుస్తోంది.

అదిరిపోయిన టాక్..

సరిలేరు నీకెవ్వరు చిత్రం టాక్ ఇప్పటికే బయటకు వచ్చింది. రివ్యూల సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం రికార్డులు బ్రేక్ చేసేలా ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కన్నులపండువగా అనిపించేలా ఉన్న సరిలేరు చిత్రంలో రొమాలు నిక్కబొడుచుకునేలా అనిపించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఇవే మహేష్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.