కందిపొడి

0
94

కందిపొడి

కందిపొడి తయారీ విధానము .

నేను అవసరమై వంటంటూ చేస్తే అన్నీ షుమారు కొలతలే .

చేతితో షుమారుగా వేస్తాను.

కాని చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పాలి కదా !

అందువలన కప్పు కొలతతో కందిపొడి తయారీ విధానము చెప్తున్నాను .

కావలసినవి —-

ఎండుమిరపకాయలు — 20

కందిపప్పు —- ఒక కప్పు

చాయమినపప్పు — పావుకప్పు

చాయపెసరపప్పు — పావుకప్పు

పచ్చి శనగపప్పు — పావుకప్పు

జీలకర్ర — రెండు స్పూన్లు

ఉప్పు — తగినంత

తయారీ విధానము .

స్టౌ వెలిగించి మీడియం మంటలో బాండీ పెట్టి బాండీ బాగా వేడెక్కెకాక ( నూనె వేయకుండా )
ఒకేసారి కందిపప్పు , ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , పచ్చి శనగపప్పు ,చాయపెసరపప్పు , జీలకర్ర వేసుకోండి .

Also READ:   పల్లెటూరి పుట్టగొడుగుల కూర

అట్లకాడతో ఆపకుండా షుమారు పది నిముషాలు దినుసులన్నీ బంగారు రంగులో కమ్మగా వేయించాలి.

చల్లారగానే వేపిన దినుసులన్నీ తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మనం తిరగలి తో విసిరితే ఎలా వస్తుందో అలా మరీ మెత్తగా కాకుండా కొద్ది బరకగా మిక్సీ వేసుకోవాలి .

వేడి వేడి అన్నంలో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని కందిపొడి కలుపుకు తిన్నామంటే —

అబ్బబ్బో ఆ రుచి వర్ణించ నా తరం కాదు .

Also READ:   బటర్‌ చికెన్‌కి ఆ రుచి ఎలా

*********************************************

కందిపొడి తో అదనంగా ********

ఈ కందిపొడి తో అన్నంలో గోదావరి జిల్లా బంధువులందరూ శ్రేష్ఠమైన అంబటి సుబ్బన్న ( A. S. Brand ) సామర్ల కోట పప్పు నూనె నెయ్యి బదులుగా వేసుకుని వేడి వేడి అన్నంలో తింటారు .

అలా కూడా రుచిగానే ఉంటుంది .

అలాగే పొడి మిక్సీ వేయబోయే ముందు వేయించిన పప్పుల్లో కొద్దిగా ఇంగువ పొడి వేసి మిక్సీ వేసుకుంటారు .

అది మరో రుచి .

నరసాపురం ( పశ్చిమ గోదావరి జిల్లా ) మా అత్తగారు
అయితే స్టౌ మీద బాండి పెట్టి పప్పు నూనె మూడు స్పూన్లు వేసి నూనె కాగగానే నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచి , రెండు స్పూన్లు పొట్టు మినపప్పు వేసి వేయించి బాగా చల్లారాక పొడిలో వేసి బాగా కలిపేవారు .

Also READ:   పెద్ద ఉసిరి కాయలతో కొబ్బరి పచ్చడి

తినేటప్పుడు పొట్టు మినపప్పు కట కట తగులుతూ చాలా రుచిగా ఉండేది .

Please View My Other Sites