కదళీఫలం

??????

? *కదళీఫలం* ?

దుర్వాస మహర్షి తన భార్య అయిన ‘ కదళి ‘ తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల ‘కదళి ‘ నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయనకోపానికి గురికాకుండా ఉంటుండేది.

ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారు కున్నాడు.ఆయన అర్ధాంగి అయిన ‘ కదళి ‘ ఎంతో సేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి,సాయం సంధ్య చేయవలసినసమయం దాటిపోతుందన్నభయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్నదుర్వాసుని తట్టి నిద్రలేపింది.

Related:   మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి

నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు ఆమె భస్మమైపోయింది .ముందువెనుకలు ఆలోచించక తానుకోపంతెచ్చుకోడంవలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు. చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు.

ఐతే కొన్ని దినాలతర్వాత దుర్వాసుని మామగారు , తనకుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తనకుమార్తె గురించీ అడగ్గా , దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయం తోమెల్లగా జరిగిన విషయమంతాచెప్పి , క్షమించమనికోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టిం చాడుట.అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.

దుర్వాసుడు తనమామగారితో ” మీ కుమార్తె -‘ కదళి -‘అందరికీ ఇష్టురాలై’కదళీఫలoరూపంలో అన్నిశుభకార్యాలలోభగవంతుని నివేదన కేకాక ,మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ , నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందు తుందని వరమిచ్చాడుట!

Related:   శ్రీ గరుడ పురాణం మొదటి అధ్యాయము

ఆకదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవునిముందుంచి కొద్దిగా తొక్క తీసి ‘ కదళీఫలం సమర్పయామి ‘ అంటూ నివేదన చేస్తాం.

???? జై శ్రీమన్నారాయణ ????

??????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *