కరోనా వైరస్ ఎఫెక్ట్…‘టోక్యో 2020 ఒలంపిక్స్‌’ని రద్దు చేస్తారా?– News18 Telugu


ప్రతీకాత్మక చిత్రం

చైనాను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో పొరుగు దేశమైన జపాన్‌లో జరగాల్సిన ‘టోక్యో 2020 ఒలంపిక్స్‌’పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆసియాలోని పలు దేశాలపై చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కోవిడ్ 19 ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 64 వేల మంది ఈ వైరస్ బారినపడగా…1383 మంది మృత్యువాతపడ్డారు. దీంతో జపాన్ రాజధాని నగరం టోక్యో‌లో జులై 24 నుంచి ప్రారంభంకావాల్సిన ఒలంపిక్స్ రద్దకావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐఓసీ) కొట్టిపారేసింది. టోక్యో ఒలంపిక్స్‌ను రద్దు చేయడం లేదా వాయిదావేసే అంశాలను పరిశీలించడం లేదని అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి స్పష్టంచేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలంపిక్స్‌ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు లేదా గేమ్స్‌ను మరో ప్రాంతానికి తరలించాల్సిన అవసరం లేదంటూ అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. టోక్యోలో మరో ఐదు మాసాల్లో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభంకావాల్సి ఉండగా…టార్చ్ రిలే వచ్చే నెల జపాన్ నుంచి ప్రారంభంకానుంది. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు టోక్యోలో అన్ని స్టేడియంలను సిద్ధం చేశారు. 56 సంవత్సరాల తర్వాత ఒలంపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని జపాన్ ఉవ్విళ్లూరుతోంది. చివరగా 1964లో ఒలంపిక్స్ గేమ్స్‌కు జపాన్ ఆతిథ్యమిచ్చింది.

ఇది చదవండి


కోవిడ్-19 భయాల నేపథ్యంలో చైనాలోని షాంఘైలో ఏప్రిల్ మాసంలో తలపెట్టిన ఫార్ములా వన్ రేస్‌ను బుధవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.First published: February 14, 2020