కలబందతో ఇలా చేస్తే మీరు తెల్లగా అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు

కలబందతో ఇలా చేస్తే మీరు తెల్లగా అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు!!
***************************
దీనికి ఆయుర్వేదంలో ఔషదాల గని, ఔషదాల రాజు అంటుంటారు. అసలు కలబంధ వాడని ఆయుర్వేద ఔషదం ఉండదేమో అంటే అతిశయోక్తి కాదు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాక సౌందర్యపోషణకు కూడా పనికివచ్చే గుణాలు కలవు. కలబంద గుజ్జుని తినడం వలన స్త్రీలల్లో గర్భ కోశవ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అలాగే కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు లాంటి వ్యాధులబారిన పడకుండా కాపాడుతుంది. జీవక్రియను పెంచి కొవ్వును కరిగించే గుణం కలిగి ఉంటుంది. అయితే ఈ కలబంద గుజ్జును ఉపయోగించి ముఖాన్ని అందంగా కాంతిమంతంగా తయారుచేసుకునే చిట్కాలను చూద్దాం…

Related:   ఆరోగ్యానికి కల్పవల్లి

1. కలబంద గుజ్జులో రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి బాగా రుద్దాలి. తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వలన పిగ్మెంటేషన్ మచ్చలు తొలగిపోతాయి.
2. కలబంద ఆకులను, ముల్లులు తీసేసి ముక్కలుగా చేసుకుని వాటిని ఒక గిన్నెలొ నీళ్లుపోసి దాంట్లో వేసి ఉడకబెట్టాలి. చల్లారిన తరువాత పేస్టు చేసుకోవాలి. దీంట్లో ఉడకబెట్టిన నీరును పడబోయకుండా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం తేనె వేసి భాగా కలిపి పేస్ కి అప్లయ్ చేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేయాలి. ఒక అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడగాలి.

Related:   Black spots on face and for Tanning

3. కలబంద గుజ్జులో పెరుగు బాగా కలిపి ముఖానికి మెడకు పెట్టి రుద్దాలి. ఆరిన తరువాత కడుక్కోవాలి. ఇలా చేయడం వలన చర్మంపై ఉండే మురికి రాషెష్ తొలగిపోతాయి. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది.
4. కలబంద గుజ్జులో ఖర్జూర పేస్టు, నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగెయ్యాలి. దీనితో పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5. అరటిపండును ముక్కలుగా చేసి మిక్సిలో పేస్టు చేసుకుని దాంట్లొ కలబంద గజ్జు, నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ కి అప్లయ్ చేసి 20 నిమిషాల తరువాత కడిగెయ్యాలి. దీంతో చర్మం కాంతివంతంగా అవుతుంది.
6. ఓట్స్ లో కలబంద గజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లయ్ చేసి గుండ్రంగా మసాజ్ చేయాలి. ఒక పదినిమిషాల తరువాత కడిగేయాలి. తద్వారా చర్మం మీది మృతకణాలు తొలగిపోయి చర్మం నున్నగా కాంతివంతంగా అవుతుంది.

Related:   Eye Dark Circles Naturally Remedy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *