కళ తెస్తుంది కలబంద

• కళ తెస్తుంది కలబంద
ముఖ చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే అలంకరణే కాదు.. మరికొన్ని జాగ్రత్తలూ తప్పనిసరే.
* రోజూ ముఖాన్ని కడుక్కుంటున్నా.. వారానికోసారి వాటిపై మృతకణాలు తొలగించాలి. అప్పుడే చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. దీనికోసం తేనె, చక్కెర కలిపి రాయాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
* ముఖ చర్మం తేమగా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తుంది. దీనికోసం రోజూ రెండుసార్లు నీళ్లతో కడుక్కోవాలి. అంతేతప్ప సబ్బు లేదా ఫేస్‌వాష్‌లు అతిగా వాడకూడదు.
* మొటిమలు వస్తే అవి మూడు నాలుగు రోజుల తరవాత పోయినా.. వాటి మచ్చలు ఉండిపోతాయి. దాంతో ముఖంలో కళ తగ్గుతుంది.
అలాంటప్పుడు కలబంద గుజ్జును రాసి ఇరవై నిమిషాలయ్యాక కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
* నాలుగు చెంచాల కీరదోస గుజ్జుకు రెండు చెంచాల పెరుగు వేసి ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా, తేమగా మారుతుంది. యౌవన కాంతీ సొంతమవుతుంది.
* శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖంలో కళ తగ్గుతుంది. ఈ సమస్య లేకుండా ఉండాలంటే పండ్లరసాలు బాగా తాగాలి.

Related:   నల్లనికురుల కోసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *