కీటో డైట్: కొవ్వును కొవ్వే కరిగిస్తుంది

0
129

ఎవరినైనా బరువు తగ్గడం ఎలా అని అడిగితే..ఇవి తినాలి, అవి తినకూడదు అంటూ బోలెడు చెప్తూంటారు. కానీ అవన్నీ కాకుండా మనం తీసుకునే ఆహరంలోనే కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అందులో కీటోడైట్ ఒకటి.

బరువు తగ్గి ఫిట్ గా మారడానికి రకరకాల డైట్లతో ప్రయోగాలు చేసి ఉండుంటారు కదా? జిమ్‌కు వెళ్లడం.. చెమటలు పట్టేలా వ్యాయామం చేయడం.. ఆపసోపాలు పడడం.. ఇవన్నీ పాత పద్ధతులు. వీటితో ఎప్పుడో జనాలు అలిసిపోయారు.

బరువు తగ్గాలంటే.. ఫుల్లుగా తినాలనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మరి తినాలంటే..అన్నీ..ఇష్టమొచ్చినట్లు తినేటయం కాదు..కేవలం కొవ్వు పదార్థాలను మాత్రమే తినడం. అదేంటీ..బరువు తగ్గాలంటే కొవ్వు పదార్ధాలు తీనకూడదని అంటారు కదూ..మరి కొవ్వు తిన్నాలంటారేంటి? అనే డౌట్ రావచ్చు..అదే మరి కొవ్వుకు కొవ్వే పరిష్కారం అంటున్న న్యూ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. కొవ్వు ఎక్కువగా తింటు కొవ్వును కరిగించుకోవటమే దీని కాన్సెప్ట్. అదేంటనే ఇంట్రెస్ట్ పెరిగింది కదూ మీక్కూడా..అదే కీటో డైట్ అని అంటున్నారు. మరి ఈ డైట్ గురించి వివరాలు తెలుసుకుందామా..?

Also READ:   క్రిష్ - పవన్ సినిమా ఒకే - విలన్ క్యారెక్టర్ ఎవరో తెలుసా - All Time Report

> కీటో డైట్ వల్ల లాభాలు ఇవే:

1. కీటో డైట్ వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. యాక్టివ్‌గా ఉంటారు.
2. మధుమేహం అదుపులోకి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ రివర్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
3. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అల్జీమర్స్ తగ్గుతుంది.
4. శరీర శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఏ పని చేసినా అంత త్వరగా అలసిపోరు. బాడీ బిల్డింగ్ చేసే వారు ఎన్ని గంటలైనా వ్యాయామం చేయవచ్చు. దీంతో శరీరం త్వరగా చక్కని షేప్‌లోకి వస్తుంది.
5. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
6. చర్మం కాంతివంతంగా మారుతుంది. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Also READ:   ఉబ్బసం ( ASTHMA )

> కీటోడైట్‌ లో ఉన్నవారు తినాల్సినవి:

చేపలు, బీఫ్, మేక, గొర్రె మాంసం, చికెన్, ఎగ్స్, ఆకుపచ్చని కూరగాయలు, కాలిఫ్లవర్, చీజ్, క్రీం, వెన్న, నట్స్, అవకాడోలు, బ్లాక్ బెర్రీలు, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, నెయ్యి, పన్నీర్ తదితర ఆహారాలను కీటో డైట్‌లో ఉన్నవారు తినాలి. కార్బొహైడ్రేట్లను అస్సలు తీసుకోరాదు. లేదంటే ఆశించిన ఫలితం రాదు.

> కీటోడైట్‌లో ఉన్నవారు తినకూడనివి:

గోధుమలు, మొక్కజొన్న, రైస్, తృణ ధాన్యాలు, చక్కెర, తేనె, యాపిల్స్, అరటి పండ్లు, ఆరెంజ్‌లు, ఆలుగడ్డలు, చిక్కుడు, బటానీ గింజలు తినరాదు.

Also READ:   జీర్ణాశయ సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు