కూర పొడి

కూర పొడి .

సాధారణంగా వంకాయ , దొండకాయ మరియు బెండకాయ వంటి కూరల్లో వెరైటీగా ఆ కాయలలో పొడిని పెట్టుకుని కాయలపళంగా కూర చేసుకుంటాము .

ఈ కూర పొడి కొద్దిగా మార్పులు చేసుకుని కొట్టుకోవచ్చు.

అదేవిధంగా ఒకసారే కొట్టుకుని సీసాలో భద్రపరచుకుంటే నాలుగైదు సార్లకు వస్తుంది.

ఈ విధముగా కొట్టుకున్న పొడి సీసాలో భద్రపర్చుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మూడు నెలల వరకు తాజాగా ఉంటుంది .

మేం సాధారణంగా ఇలా చేసుకునే రెండు రకముల కూర పొడుల గురించి మీకు తెలియ చేస్తాను .

మొదటి విధానము .

ఈ పొడి మసాలా టచ్ లేకుండా మామూలుగా ఉంటుంది .

ఎండుమిరపకాయలు — 25
పచ్చిశనగపప్పు — 50 గ్రాములు
చాయమినపప్పు — 50 గ్రాములు
జీలకర్ర — మూడు స్పూన్లు .
నూనె — నాలుగు స్పూన్లు .
ఉప్పు — తగినంత

Related:   సంక్రాంతి స్పెషల్ - అరిసెలు

తయారీ విధానము .

స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి , నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు ( తొడిమలు తీసి ) , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు మరియు జీలకర్ర వేసుకుని మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

కొద్దిగా చల్లారగానే తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .

రోటి సౌకర్యము ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో దంపుకుంటే రెట్టింపు రుచిగా ఉంటుంది.

తర్వాత సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .

అవసరయయినప్పుడు ఫ్రిజ్ లో నుండి తీసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు కలుపుకుని , కూరల్లో పెట్టుకుని , కాయలను నూనెలో వేయించుకోవాలి.

రెండవ విధానము .

Related:   recipe

కొద్దిగా మసాలా కూరలా చేసుకోవాలంటే —-

కావలసినవి .

ఎండుమిరపకాయలు — 25
పచ్చిశనగపప్పు — 50 గ్రాములు
చాయమినపప్పు — 50 గ్రాములు
ధనియాలు — 20 గ్రాములు
జీలకర్ర — రెండు స్పూన్లు
ఎండుకొబ్బరి — పావు చిప్ప . చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
కరివేపాకు — అయిదు రెమ్మలు .
నూనె — నాలుగు స్పూన్లు
ఉప్పు — తగినంత

తయారీ విధానము .

ముందు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు, జీలకర్ర , ఎండుకొబ్బరి ముక్కలు మరియు కరివేపాకు వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకుని చల్లారగానే మిక్సీ లో వేసి , తగినంత ఉప్పువేసి మరీ మెత్తగా కాకుండా పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .

Related:   చింతపండు పచ్చడి

రోటి సౌకర్యం ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో పప్పులు తగిలే విధముగా దంపుకుంటే ఈ మసాలా కూర పొడి చాలా రుచిగా ఉంటుంది .

తర్వాత సీసాలో భద్రపర్చుకుని , ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .

అవసరమైనప్పుడు ఫ్రిజ్ లోనుండి తీసుకుని అవసరమైన యెడల కొద్ది ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టుకోవాలి .

ఈ కూరపొడి కూడా రెండు నెలల పైన నిల్వ ఉంటుంది .

మనం కూరల్లో కూరే ముందు పొడి నాలుక పై వేసుకుని రుచి చూస్తే ఉప్పగా తగిలితే వేగిన కూరలో సరిపోతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *