కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు

0
88

Please View My Other Sites

*కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు*

1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు…?

2.మనకు అర్థం కాకున్నా భద్రంగా దాచుకునేది ఏది?
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్…?

3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?
డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి…?

Also READ:   Facebook మహిమ.

4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?
ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు?

5.భర్తను భార్య ‘మావారు’ అని అంటుంది ఎందుకు?
మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి…?

6.పొలాలు అభివృద్ధి చెందితే?
ప్లాట్లు అవుతాయి?

7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే….’ఆరోగ్య శ్రీ’ వర్తిస్తుందని పేసెంట్ చెప్పినప్పుడు..????? ********************
“SORRY “
అనే పదము చాలా
చిత్రంగా ఉంటుంది…
మనము చెబితే మన వాళ్ళు
దగ్గరౌతారు.
అదే డాక్టర్ చెబితే
మనవాళ్ళు మనకు
దూరమౌతారు….!?
******************** ప్రపంచంలో
రెండు అతి ప్రమాదకరమైన
మారణాయుధాలు!
1. భార్య కన్నీరు
2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!
??????
********************
మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .
కానీ … ఆ మెతుకు … బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .
??????
********************
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా…………………..
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ ??
********************
మీరు నవ్వుకోవడం కాదు అందరికి పంపండి….

Also READ:   భలే డౌటు