కొండ పిండి చెట్టు

Spread the love

కొండ పిండి చెట్టు
***********************
కిడ్నీలోగాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. కాగా రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జిలుకర్ర, నవ్వోతు(పటికబెల్లం) పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. అంతకన్న ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమి ఉండదు.

Also READ:   జ్ఞాపకశక్తి పెరగాలంటే 8 ఎఫెక్టివ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయండి | 8 Effective Brain Exercises To Improve Your Memory
Updated: July 3, 2018 — 3:13 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *