కొత్తిమీర అన్నం

కొత్తిమీర అన్నం.

కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మంచిది .

కూరలలో , పచ్చడులలో , రసము , పులుసు , సాంబారులలో కొత్తిమీర పచ్చిగా అంటే నూనెలో వేయించకుండా తీసుకుంటే పోషక విలువలు వృధాకాకుండా ఉంటాయి .

ఆ కోవలో చెందినదే ఈ కొత్తిమీర అన్నం .

కావలసినవి .

బియ్యము — ఒక గ్లాసు.
కొత్తిమీర – చిన్నవి మూడు కట్టలు లేదా పెద్దది ఒక కట్ట శుభ్రము చేసుకుని ఉంచుకోవాలి.
పచ్చి కొబ్బరి తురుము — అర కప్పు
పచ్చి మిర్చి — మొత్తము పది . ఆరు మిశ్రమము లోకి , నాలుగు పోపు లోకి
కరివేపాకు — మూడు రెమ్మలు .
పసుపు — అర స్పూను .
నూనె — ఆరు స్పూన్లు
చింతపండు — నిమ్మకాయంత. పావు గంట సేపు
వేడి నీటిలో నానబెట్టి చిక్కని రసము షుమారు అర గ్గ్లాసు తీసుకోవాలి.
ఉప్పు — తగినంత

Related:   మసాల కుల్చా

పోపునకు.

ఎండుమిరపకాయలు – 8
పచ్చిశనగపప్పు — రెండు స్పూన్లు
చాయమినపప్పు — స్పూనున్నర
ఆవాలు — స్పూను
ఇంగువ — మొత్తము పావు స్పూను .
జీడిపప్పు — పది పలుకులు .

తయారీ విధానము .

ముందుగా ఒక గ్లాసు బియ్యము పదిహేను నిముషాల ముందు నానబెట్టి , ఒక గిన్నెలో పోసి సరిపడా నీళ్ళు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచి దింపుకోవాలి .

తర్వాత మిక్సీ లో పచ్చి మిరపకాయలు , పచ్చి కొబ్బరితురుము , మొత్తము కొత్తిమీర , సరిపడా ఉప్పు , మరియు కొద్దిగా పచ్చి ఇంగువ వేసి కొంచెము కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి .

తరువాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు, చాయమినపప్పు , జీడిపప్పు , ఆవాలు , మిగిలిన మొత్తము ఇంగువ, నాలుగు పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .

Related:   మరో వెరైటీ టమోటో రసం

తర్వాత చింతపండు రసము కూడా పోపులో వేసి బాగా ఉడక నివ్వాలి .

ఒక బేసిన్ లో వండిన అన్నం వేసుకుని , పసుపు వేసుకుని , ఉప్పు చూసి వేసుకుని , ముద్దగా నూరిన కొత్తిమీర మిశ్రమము వేసుకుని గరిటతో బాగా కలుపు కోవాలి .

తర్వాత వేయించి సిద్ధంగా ఉంచుకున్న పోపు కూడా వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర అన్నం సర్వింగ్ కు సిద్ధం.

చింతపండు బదులుగా మూడు నిమ్మ కాయలు రసము తీసుకుని కూడా చేసుకొనవచ్చును .

Related:   కొబ్బరి పచ్చడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *