కొన్ని ఆరోగ్య చిట్ట్కలు

*కొన్ని ఆరోగ్య చిట్ట్కలు*

*కొలెస్ట్రాల్ అధికబరువు*
*************

శుద్దగుగ్గులు
కరక్కాయ పెచ్చులు
వెల్లుల్లి
పొడపత్రం
పొంగించిన ఇంగువ
నల్లుప్పు
తిప్పతీగ
అన్ని సమముగా మర్ధించి భోజనానికిముందు కుంకుడు గింజంత 3 పూటలు వాడుతున్న కొలెస్ట్రాల్
అధికబరువు తగ్గును.

*మిరపకాయ తింటే ఆ శక్తి పెరుగుతుందా…?*

సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రధానంగా మిరపకాయ మూత్ర వ్యాధులు గల వారికి హాని కలిగిస్తుంది. వారు మిరపకాయలకు దూరంగా ఉండడమే మంచిది.

మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. ఆహారాన్ని పచనం జేసి, విరేచనాన్ని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. పావు కేజీ ఆముదంలో రెండు ఎండు మిరపకాయలు వేసి మరిగించి చల్లారిన తరువాత కీళ్లకు మర్థనా చేసుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెను ఎక్కువగా పూసి రుద్దుతుంటే బొబ్బలెక్కే ప్రమాదముంది. మితంగా వాడుకోవాలి.

కొద్ది కారము, దానికి సమానంగా ఇంగువ, పిప్పరమెంతులను కలిపి అజీర్తి విరేచనాలతో బాధపడేవారికి రోజుకు 2-3 పర్యాయాలు కొద్దిగా రాస్తుంటే విరేచనాలు తగ్గుతాయి.

*ఉబ్బస వ్యాధి*
************

* ఉత్తరేణి చెట్టు సమూలంగా తెచ్చి కాల్చి భస్మం చేసి జల్లెడ పట్టి నిలువ ఉంచుకుని పూటకు ఒక గ్రాము మోతాదు గా ఒక టీ స్పూన్ తేనే కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే కఠిన ఉబ్బస రోగాలు తగ్గుతాయి .

Related:   Vitamin E

* కుప్పింట చెట్టు సమూలంగా తీసి కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి ఆ చుర్ణానికి తేనే కలిపి దంచి ముద్దచేసి నిలువ చేసుకోవాలి . రోగబలాన్ని , రోగి బలాన్ని బట్టి , వయస్సుని బట్టి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బసపు దగ్గు హరించును.

* గలిజేరు చెట్టు వ్రేళ్ళతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి కత్తిరించి ఆవుపాలలొ ఉడకబెట్టి ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా బెల్లం , నెయ్యి కలిపి ఉదయం పూటనే తింటూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.

* రావిపండ్లు తెచ్చి ముక్కలుగా కోసి ఎండబెట్టి దంచి చూర్ణం కొట్టి జల్లెడపట్టి ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా రెండు పూటలా తేనేతో కాని పటికబెల్లం చూర్ణం తో కాని కలిపి తింటూ ఉంటే ఉబ్బస రోగం హరించును. ఇది స్త్రీలకు, సంతాన యోగం కూడా కలిగించ గలదు.

* పసుపు కొమ్ములు దంచిన చూర్ణం ఒక గ్రాము నుండి రెండు గ్రాముల వరకు ,ఉప్పు తమలపాకు లొ పెట్టుకుని తింటూ ఉంటే ఉపిరితిత్తులు బిగబట్టి శ్వాస కష్టంగా ఉండే సమస్య తొలగిపోవును.

* మారేడు ఆకులు, 10 గ్రా తీసుకుని 40 గ్రా మంచినీళ్ళలో వేసి 10 గ్రా కషాయం మిగిలేలా మరగబెట్టి వడపోసి చల్లార్చి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గును .

* శొంటి 20 గ్రా చూర్ణం లొ 300 గ్రా నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి , 100 గ్రా మిగిలేంత వరకు కాచి దించుకొని వడకట్టాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే క్రమంగా ఉబ్బసం హరించి పొతుంది.

Related:   Dental Council of India proposes to MCI to conduct three-year MBBS bridge course for BDS graduates

* జిల్లేడు చెట్టు మొగ్గలు 15 గ్రా , వాము 10 గ్రా , బెల్లం 15 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి మెత్తగా మర్దించి 5 గ్రా బరువు ఉండేలా మాత్రలు తయారు చేసుకోవాలి . ప్రతిరొజు ఉదయం పూట మాత్రమే మంచినీళ్ళతో వేసుకోవాలి . ఈ విధంగా 40 దినాలు చేస్తే ఎంత కటినమైన ఉబ్బసం అయినా సమూలంగా నివారించ బడును.

* ఉల్లిపాయ రసం 50 గ్రా , వెల్లుల్లి రసం 50 గ్రా , అల్లం రసం 50 గ్రా , కలబంద రసం 50 గ్రా , పట్టు తేనే 50 గ్రా ఈ పదార్దాలు అన్ని గాజు సీసాలో పోసి మూతగట్టిగా పెట్టి మూడు రోజుల పాటు ఆ సీసాని భూమిలో పాతిపెట్టాలి.ఆ తరువాత దాన్ని బయటకి తీసి రోజు రెండు సార్లు 5 గ్రా మోతాదుగా లొపలికి తీసుకుంటూ ఉంటే మూడు వారాల్లో ఉబ్బసం వ్యాధి సమూలంగా అంతరించి పొతుంది.

* ఒక కప్పు టీ డికాక్షన్ లో ఒక నిమ్మ పండు రసం ఉప్పు కలిపి తాగితే ఉబ్బసం వెంటనే శాంతించును. ఇది తాత్కాలికంగా పనిచేయును .

* నేలతాడి గడ్డల చూర్ణం 5 గ్రా , పటికబెల్లం చూర్ణం 5 గ్రా కలిపి ఒక మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.

* శారీరక శక్తిని బట్టి రోజు 5 నుండి 10 చుక్కల శుద్ధమైన వేప నూనెని తాంబూలం లొ వేసుకొని నమిలి మింగుతుంటే మూడు వారాలలో కటినమైన ఉబ్బస వ్యాధి హరించును.

* రోజు రెండు పూటలా భరించ గలిగినంత వేడి నీటిని ఒక పళ్ళెంలో పోసి ఉబ్బసం రోగి తన పాదాలని ఆ నీటిలో ఉంచడం వలన ఉబ్బసం శాంతిస్తుంది.ఇలా రెండు పూటలా చేస్తూ తగిన ఔషధాలు , ఆహర నియమాలు పాటిస్తే తొందరగా ఉబ్బస వ్యాధి నుంచి కోలుకొంటారు.

Related:   CDL Test Download - English & Spanish Class A CDL test files (.pdf) | CDL-TEST.com | CDL TEST ANSWERS - DMV TEST ANSWERS

* చక్ర కేళి అరటి పండు ని ఆవుమూత్రం లొ మెత్తగా పిసికి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఆవుమూత్రం పతంజలి స్టోర్స్ లొ దొరుకును.

* ఉత్తరేణి గింజలు 5 గ్రా , మిరియాలు 10 గ్రా , ఈ రెండింటిని తుమ్మ చెట్టు జిగురు నీళ్లతో నూరి గురుగింజ అంత మాత్రలు చేసి పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూటలా మంచినీళ్ళు తో వేసుకోవాలి . ఈ విధంగా చేయడం వలన ఉబ్బసవ్యాది పూర్తిగా తగ్గిపోవును .

*గమనిక -*

పైన చెప్పిన ఏదో ఒకటి ఎంచుకుని మీ వ్యాధిని తగ్గించుకోనగలరు. అదే విధంగా యే అయుర్వేద ఔషదం అయినా 3 నెలలు విడవకుండా వాడినప్పుడే తన ప్రభావాన్ని బలంగా చూపిస్తుంది.

మూలికలు మీకు పచారి షాపుల్లో దొరుకుతాయ

*దగ్గులు*
***

సీమ కరక్కాయలు,
జాజికాయలు,
కాచు
యాలకులు
సమభాగములు తీసుకొని, మెత్తటి చూర్ణము చేసి, ప్రతి దినమూ 2 లేదా 3 సార్లు , 1/2 స్పూన్ చూర్ణమును, తేనెతో సేవించుచున్న ఎన్ని దినములకూ తగ్గని దగ్గులు తగ్గిపోగలవు.

2.కచోరములను మెత్తటి చూర్ణము కావించి, ప్రతి నిత్యమూ ఈ చూర్ణమును తేనెతో కలిపి, సేవించుచున్న అన్ని విధములయిన దగ్గులు హరించుకుపోగలవు. జలుబు వలన సీతాకాలములో కలిగిన గొంతు నొప్పులు, గీర మొదలగునవన్నియూ నివారింపబడగలవు.

3.చేదు పొట్లకాయను నీడలో బాగుగా ఎండించి, మెత్తటి చూర్ణము అగువరకు నలుగకొట్టి, ఆ చూర్ణము నందు తేనె చేర్చి, ప్రతి దినమూ సేవించుచున్న, పొడి దగ్గులు, కంఠమునందు కలుగు గిలిగింతలు నివారింపబడును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *