కొబ్బరి కారం / కొబ్బరి పొడి

0
92

కొబ్బరి కారం / కొబ్బరి పొడి .

కావలసినవి .

ఎండు కొబ్బరి చిప్పలు — 2
ఎండుమిరపకాయలు — 15
జీలకర్ర — స్పూనున్నర
వెల్లుల్లి పాయ రెబ్బలు — 15
ఉప్పు — తగినంత .

తయారీ విధానము .

ముందుగా స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టుకోవాలి .

ఎండు కొబ్బరి చిప్పలు స్టౌ మీద పెట్టి వెనుక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన వచ్చేదాకా కాల్చుకోవాలి .

ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడి పోవచ్చును లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం ఉంది .

Also READ:   మిల్క్ బక్లవ కేక్ ను తయారుచేసే విధానం: క్రిస్మస్ స్పెషల్

కొబ్బరి చిప్పలు చల్లారగానే ఎండు కొబ్బరి తురుముతో తురుము కోవాలి .

లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి .

ఎండుమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .

వెల్లుల్లి పాయలు పై పొట్టు తీయకుండా రెబ్బలుగా వలుచుకోవాలి .

ఇప్పుడు మిక్సీలో వేగిన ఎండుమిరపకాయలు , జీలకర్ర , తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .

తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు / లేక తురిమిన ఎండు కొబ్బరి మిక్సీ లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి .

Also READ:   బెండకాయ మసాలా కూర

చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోవాలి .

తర్వాత ఒక సీసాలో భద్రపర్చుకోవాలి .

వెల్లుల్లి ఇష్టం లేని వారు మరో అర స్పూను జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు .

ఈ కొబ్బరి పొడి షుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది .

ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది .