క్యాబేజి  పకోడీలు

Spread the love

క్యాబేజి  పకోడీలు .

కావలసినవి .
శనగపిండి  —  ఒక  కప్పు.

క్యాబేజి  షుమారు  150 గ్రాములు  తీసుకుని   ఎండు కొబ్బరి కోరాముతో సన్నగా  తురుముకుని  ఒక  కప్పు  క్యాబేజి  తురుము  సిద్ధం  చేసుకోవాలి .

పచ్చి మిరపకాయలు  —  5  సన్నగా  తరుగు కోవాలి .

అల్లం  —  చిన్న ముక్క  తీసుకుని పై చెక్కును  తీసి   సన్నగా  తురుము కోవాలి .  లేదా  సన్నని  ముక్కలుగా చేసుకోవాలి .

కరివేపాకు   —  తరుగుకొని  ఒక  పావు  కప్పు  సిద్ధం  చేసుకోవాలి .

Also READ:   ఎక్కువయితే ఎండబెడదాం

ఉల్లిపాయలు  —  రెండు  సన్నగా  నిలువుగా  తరుగుకోవాలి .

కారం  —  ఒక  స్పూను

పసుపు  —  కొద్దిగా

ఇంగువ  —  కొద్దిగా

బియ్యపు  పిండి —  రెండు  స్పూన్లు .

నూనె  —  350  గ్రాములు.
తయారీ విధానము  .
ఒక  గిన్నెలో , శనగపిండి ,  బియ్యపు  పిండి , క్యాబేజి తురుము,  తరిగిన  ఉల్లిపాయలు , తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు ,  తరిగిన   అల్లం  తురుము , కొద్దిగా  పసుపు , కొద్దిగా  ఇంగువ , తరిగిన  కరివేపాకు , స్పూను  కారం , తగినంత  ఉప్పు వేసి  కొద్దిగా  నీళ్ళు  పోసుకుని  చేతితో  పకోడీలు  వేయటానికి  వీలుగా  బాగా కలుపుకోవాలి .
ఆ తర్వాత  స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకుని  మొత్తం  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చిన్న చిన్న  పకోడీలు  లాగా  వేసుకుని , బంగారు  రంగు  వచ్చే  విధముగా   వేయించుకుని  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .
అంతే .  అన్నం లోకి  మరియు  అల్పాహారమునకు  అనువుగా  ఉండే  వేడి  వేడి  క్యాబేజీ  పకోడీలు  సర్వింగ్  కు  సిద్ధం .

Also READ:   మెంతిబద్దలు

Updated: April 11, 2019 — 2:26 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *