క్యారెట్‌ ముక్కల పచ్చడి

• క్యారెట్‌ ముక్కల పచ్చడి
కావలసినవి: క్యారెట్‌ – పావు కిలో, ఆవ పొడి – మూడు టేబుల్‌ స్పూన్లు, కారం, ఉప్పు – ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఆవ నూనె – అర కప్పు.
తయారీ:
క్యారెట్స్‌ తొక్కను పీల్‌ చేయాలి. తరువాత వాటిని నిలువుగా తరగాలి.
పైన చెప్పిన అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తరిగిన క్యారెట్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. తరువాత శుభ్రమైన గాజు సీసాలోకి తీసి మూత పెట్టాలి.
ఈ సీసాను రెండు రోజులు ఎండలో ఉంచాలి. అలా ఉంచినప్పుడు రోజుకి ఒకసారి పచ్చడిని తడిలేని గరిటెతో కదపాలి. తరువాత ఫ్రిజ్‌లో ఉంచితే ఈ పచ్చడి రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. ఇందులో నిలువుగా తరిగిన పచ్చి మిర్చిని కూడా వేసుకోవచ్చు. శీతాకాలంలో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

READ:   పొదినా మరియు కొత్తిమీర పచ్చడి

Originally posted 2019-03-23 12:26:31.