క్రిష్ – పవన్ సినిమా ఒకే – విలన్ క్యారెక్టర్ ఎవరో తెలుసా – All Time Report

0
8పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అని చూస్తున్నారు.. తాజాగా ఆయన పింక్ చిత్రం చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఆయన ఈ చిత్ర షూటింగులో పాల్గొంటారు అని తెలుస్తోంది, అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకుండానే మరో వార్త వినిపిస్తోంది.

ఆయన పింక్ సినిమా తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారట. పింక్ తరువాత ఆయన దాదాపు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్త ఫిల్మ్ నగర్లో కొద్ది రోజులుగా వినిపిస్తోంది. నిర్మాత ఎ.ఎమ్.రత్నం బ్యానర్లో పవన్ ఒక సినిమా చేయవలసి వుంది గతంలో ఆయన మాట ఇచ్చారు. పవన్ రాజకీయాల్లోకి రావడం వలన ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. అందుకే ఆయన క్రిష్ తో ఈ సినిమా చేస్తారు అని తెలుస్తోంది.

Also READ:   Remedies to Increase Sperm Count

అంతేకాదు బుర్రా సాయిమాధవ్ తో కలిసి స్క్రిప్ట్ పై ఆయన కసరత్తు చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో రాజకీయాల ప్రస్తావన కూడా వుంటుందట. ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో సంజయ్ దత్ నటిస్తారు అని వార్తలు వస్తున్నాయి, కాని ఇది ఇంకా ఫిక్స్ కాలేదు అని తెలుస్తోంది. అయితే ముందు పింక్ చిత్రం పట్టాలెక్కితే తర్వాత క్రిష్ చిత్రం పవన్ చేస్తారు అని నమ్మవచ్చు అంటున్నారు అభిమానులు.

Also READ:   మీ ఆరొగ్యానికి మొలకలు

Please View My Other Sites