ఖర్జూర

ప్రపంచంలోకెల్లా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంలో ఖర్జూర ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు, బీపీ కూడా అదుపులో ఉంటుంది. మంచి పోషకాలను అందించడంతో పాటుగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో ఖర్జూరం ఎంతగానో తోడ్పడుతుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తం పుష్కలంగా వస్తుంది. సాధార‌ణ ఖ‌ర్జూరం పండ్లలాగే ఎండ బెట్టిన ఖ‌ర్జూరాలూ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోప‌డ‌తాయి. నిత్యం 5 ఎండు ఖ‌ర్జూరాల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున (బ్రష్ చేసిన వెంటనే) నెలరోజుల పాటు తింటే అద్భుతమైన ఆరోగ్య సొంతమవుతుంది.

Related:   Project Archetypes | Discover Archetype Personality Now!

ప్రయోజనాలు:
* ఎండు ఖ‌ర్జూర పండ్లను ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా మారుతాయి.
* మూత్రం సాఫీగా వ‌స్తుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్యల‌న్నీ పోతాయి.
* పెద్ద పేగులో ఉండే స‌మ‌స్యలు తొల‌గిపోతాయి. జీర్ణం సూపర్ ఫాస్ట్ అవుతుంది.
* డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ల‌భించ‌డం వ‌ల్ల విరేచ‌నం సుల‌భంగా అవుతుంది. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య ఉన్న వారికి మేలు చేస్తుంది.
* రాత్రి పూట కొన్ని ఖర్జూరాలను నీటిలో వేసి తెల్లవారాక ఆ నీటిని తాగితే విరేచనం సాఫీగా అవుతుంది.
* గొంతు నొప్పి, మంట‌, జ‌లుబు లాంటి స‌మ‌స్యలు తొల‌గిపోతాయి.
* 100 గ్రాముల ఖర్జూరలో 0.90 ఎంజీ ఐరన్ లభిస్తుంది. రోజులో మనకు అవసరమయ్యే ఐరన్‌లో ఇది 11 శాతానికి సమానం.
* బీపీ నియంత్రణ‌లో ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
* అసిడిటీ, అల్సర్ వంటి స‌మ‌స్యలు మటుమాయమవుతాయి.
* విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మానికి మేలు జ‌రుగుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల చ‌ర్మానికి క‌లిగే న‌ష్టం త‌గ్గుతుంది. వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
* వెంట్రుక‌లు చిట్లడం, రాలిపోవ‌డం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి.
* ఖర్జూర పండ్లలో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. ఇది డయేరియా రాకుండా చూడటంలో తోడ్పడుతుంది.
* వీటిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి బరువు తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
* అయితే వీటిలో చక్కెర ఉంటుంది కాబట్టి పరిమితంగానే తీసుకోవడం మంచిది.

Related:   1 Minute Weight Loss - Forget the exercise regimes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *