గరుత్మంతుడి గర్వమణచిన హనుమ

గరుత్మంతుడి గర్వమణచిన హనుమ

సాధారణంగా వైష్ణవ క్షేత్రాల్లో స్వామివారి గర్భాలయానికి ఎదురుగా హనుమంతుడు గానీ .. గరుత్మంతుడు గాని కొలువుదీరి కనిపిస్తుంటారు. ఇక స్వామివారి వాహన సేవల్లోను గరుడవాహనం .. హనుమవాహనం ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఇక ఈ ఇద్దరూ ప్రత్యేక మందిరాల్లో కొలువై దర్శనమిచ్చే క్షేత్రంగా ‘మన్నారు పోలూరు’ దర్శనమిస్తూ ఉంటుంది.

నెల్లూరు జిల్లాలో గల ఈ క్షేత్రం గరుత్మంతుడికి గర్వభంగం కలిగించినదిగా స్థలపురాణం చెబుతోంది. శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలో జాంబవంతుడికి శ్రీరామచంద్రుడుగా దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడుని కూడా పిలుచుకు రమ్మని స్వామి గరుత్మంతుడిని పంపించాడు. తనంతటి బలశాలి లేడనే గర్వంతో గరుడుడు, హనుమంతుడి ధ్యానానికి భంగం కలిగించాడట.

రామనామ స్మరణకి భంగం కలిగించిన గరుడినిపై హనుమ కోపంతో చేయి చేసుకుంటాడు. హనుమంతుడు కొట్టిన ఆ దెబ్బకి .. ఆయన ముందు తాను ఎంత బలహీనుడననేది గరుడినికి అర్థమైంది. ఆ తరువాత విషయం తెలుసుకున్న హనుమ .. ఆయనని అనుసరించి ఇక్కడికి వచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒక చెంప వాచినట్టుగా గరుడుడు .. సంతోషంతో హనుమతుడు దర్శనమిస్తూ ఉంటారు.

Related:   జాతరమ్మ జాతర మేడారం జాతర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *