గాల్ బ్లాడర్ స్టోన్స్ ……ఆయుర్వేదం

గాల్ బ్లాడర్ స్టోన్స్ ……ఆయుర్వేదం

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ ఆయుర్వేద చికిత్సతో ఆ అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. మళ్ళీ మళ్ళీ సమస్య పునరావృతం కాదు.

ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతము పిత్తాశయంలో చేరి తన రూక్ష్మ గుణంచే పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తము తన పాకగుణంచే దీనిని ఒక రాయిలా తయారుచేయును. దీనిని పిత్తాశ్మరీ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది కొలెస్ట్రాల్ స్టోన్ . పైత్యరసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్‌ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకుని కొలెస్ట్రాల్‌ స్టోన్ గా మారుతుంది.

రెండవది ఫిగ్మెంటెడ్‌ స్టోన్‌. కాలేయంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలు నాశనం చేసేటప్పుడు (హీమోలైసిస్‌) బైలిరూబిన్‌ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నప్పుడు పిగ్మెంటెడ్‌ స్టోన్స్ ఏర్పడతాయి.

READ:   మద్ది చెట్టు ( అర్జున )

లక్షణాలు:

ఈ పిత్తాశ్మరీ పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కుడివైపు పక్కటెముకల కింది భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు వీపు గూఢ భాగములోనికి పొడుస్తుంది. నొప్పి హఠాత్తుగా మొదలయి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు వస్తుంది. వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతి రావడం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాయి పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పిత్తాశయంలోనే రాయి స్థిరంగా ఉంటే ఒక్క లక్షణం కనిపించదు.

నిర్ధారణ:

ఎక్స్‌రే ప్లెయిన్‌ అబ్డామిన్‌, రక్తపరీక్ష, అల్ట్రాసోనోగ్రఫీ అప్పర్‌ అబ్డామిన్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఎండోస్కోపిక్‌ రిట్రోగ్రేడ్‌ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ అనే నూతన పద్ధతి ద్వారా రాయి పరిమాణం, అదిఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు.

READ:   ఆరోగ్యాన్ని పెంపొందించే సబ్జా గింజ‌లు.... అవి ఏం చేస్తాయో తెలుసా...?

శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా?

గాల్‌స్టోన్స్‌ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు లితోట్రిప్సీ అనే సర్జికల్‌ పద్ధతి ద్వారా తీసివేయడం లేదా పిత్తాశయాన్ని తొలగించడం(కొలసిస్టెక్టమీ) చేస్తారు. ఈ విధంగా పిత్తాశయం తీసినవేసిన వారిలో అరుగుదల మందగించడం, కడుపు ఉబ్బరం, విరేచనాలు ఎక్కువ కావడం, కామెర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకుని సరియైున నిర్ణయం తీసుకోవాలి.

ఆయుర్వేద చికిత్స:

ఆయుర్వేదంలో వాతాదిదోషాలు ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ కరిగిపపోయేలా చేయవచ్చు. శరీరంలో దోష సామ్యతను కలిగించడం ద్వారా గాల్‌స్టోన్స్‌ మళ్లీ మళ్లీ తయారుకాకుండా నివారించవచ్చు. ఆయుర్వేద చికిత్స ద్వారా పిత్తాశ్మరీని పూర్తిగా శాశ్వతంగా తగ్గించవచ్చు.

READ:   దోసకాయలు

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

Originally posted 2019-02-11 08:20:19.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *