గుడ్డూ….. కలిపి తింటే!

• గుడ్డూ….. కలిపి తింటే!

గుడ్డు బలవర్ధకమైన ఆహారం అని మనకు తెలుసు. దీనిలోని విటమిన్లూ, మాంసకృత్తులూ, ఖనిజాలూ, కొవ్వులు మనకు ఎంతో బలాన్నీ, ఆరోగ్యాన్ని ఇస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్డును ప్రత్యామ్నాయ పదార్థంగా ఎంచుకోవచ్చు. దాంతోపాటూ ఏయే పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందో చూద్దామా!

* పాలకూరతో…

పాలకూర గుజ్జూ, గుడ్డును కలిపి ఆమ్లెట్‌గా తీసుకోవచ్చు. దీని నుంచి మనకు పోషకాలతోపాటు కావాల్సిన ఇనుము లభిస్తుంది. కప్పు పాలకూర నుంచి కేవలం ఏడు కెలొరీలు మాత్రమే లభిస్తాయి. ఇది మనకు కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. అంతేకాదు పాలకూరను తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్లుగా ఉండి చాలాసేపటి వరకు ఆకలి వేయదు.

Related:   Metabolic Cooking

* కొబ్బరినూనెతో…

వెన్నా, వంటనూనెతో వేసుకున్న ఆమ్లెట్‌ రుచి అమోఘం కదూ! దాంతోపాటు మీ శరీరంలో కెలొరీలూ కూడా పెరుగుతాయి. ఈసారి ఆమ్లెట్‌ను కొబ్బరినూనెతో వేసి చూడండి. వంటనూనెకు బదులుగా దీన్ని వాడటం వల్ల పొట్ట ప్రాంతంలో కొవ్వు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజూ రెండు చెంచాల కొబ్బరి నూనెను ఇలా ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.

* ఓట్‌ మీల్‌తో…

ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల మీ నడుము ప్రాంతంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్లు ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. ఇది ఆహారం నెమ్మదిగా జీర్ణమవడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఆకలిని తగ్గించే, కెలొరీలను కరిగించేలా చేస్తుంది. కాబట్టి రోజూ ఓట్స్‌కు జతగా గుడ్డునూ కలిపి తీసుకుంటే మంచిది. అలా తీసుకోవడం వల్ల కెలొరీలూ ఖర్చవుతాయి, శక్తీ లభిస్తుంది.

Related:   నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *