గోధుమ పిండి& బెల్లంతో చేసిన తీపిగవ్వలు

గోధుమ పిండి& బెల్లంతో చేసిన తీపిగవ్వలు????
గోధుమ పిండి 1/2kg
బెల్లం 250 grms
వెన్న 50 grms
సాల్ట్ కొద్దిగా
వంటసోడ చిటికెడు
ఆయిల్ వేయించడానికి సరిపడా
ముందుగా గొదుమపిండిలో ,వెన్న,సాల్ట్,వంట సోడా వేసి పూరి పిండి లా కలిపి ఐదు నిముషాలు పూర్తిగా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కలిపి పెట్టుకున్న గోధుమపిండిని గువ్వల చెక్కపై గవ్వలు మాదిరిగా వత్తుకోవాలి,అలా మొత్తం అయిపోయాక స్టో పై బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలు గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.తరువాత బెల్లాన్ని కరిగించి వడకట్టి మరొక గిన్నెలో తీగ పాకం వచ్చేవరకు ఉంచి కొంచెం యాలకుల పొడి వేసి, వేయించుకున్న గవ్వల్ని పాకం లో వేసి బాగా కలియబెట్టి ఫ్యాన్ కింద ఆరనివ్వాలి.అరేటప్పుడు కలియబెడుతూ ఉంటే అంటుకోకుండా ఉంటాయి….అందరూ ఎక్కువగా మైదా పిండి & పంచదరతో చేస్తారు.కానీ ఆరోగ్య పరంగా బాగుంటుందని నేను గోధుమ పిండి& బెల్లంతో చేసాను…

Related:   పచ్చి మిరపకాయల కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *