చర్మం నల్లబడుతుంటే

??????????????

*చర్మం నల్లబడుతుంటే*

కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు…చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడు తుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతా యి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్య లుగా చెబుతుంటారు.

హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సంబంధిత సమ స్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మం దుల కారణంగా, శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభదశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

కొన్ని చిట్కాలు:

1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.

2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.

3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్‌ లోషన్‌ ముఖానికి రాసుకోవాలి.

4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.

Related:   కాళ్లకు కలబంద

5. కొంచెం క్యారెట్‌, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్‌ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

6. పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. బాదం గింజలను బాగా నానబెట్టి పేస్టు చేసుకోవాలి. దీంట్లో కొంచెం పాలపొడి, కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, కొంత ఆలివ్ ఆయిల్‌ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మెడచుట్టూ పట్టించాలి. 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. దీనివల్ల మెడచుట్టూ ఉన్న నల్ల వలయాలు పోయి అందంగా ఉంటుంది.

*కె. శివరామ కృష్ణ.*

??????????????
[3:24pm, 27/11/2017] ‪+91 93242 45525‬: ??????????????

*అందానికి సూత్రాలు*

* నిమ్మపండు తొనలు, కమలా తొనలు, తులసి మొగ్గలు, సీమచామంతి, ఇలా ఏదైనా సరే వాటిరసంతో మసాజ్ చేసుకోవచ్చు. అదే తొనలతోనయితే సరిపోయే నీటిని కలుపుకుని రాసుకుని మసాజ్ చేసుకుని కడిగేసుకోవచ్చు.

* ఒక టీస్పూన్ ఆముదము తీసుకోండి. బీవ్యాక్స్ ఒక అరటీస్పూన్, ఆప్రికాట్ నూనె ఒక అరటీస్పూన్, సముద్రపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ ఒక టీస్పూన్, బేబీషాంపూ రెండు టీస్పూన్లు తీసుకోండి. బీవ్యాక్స్ను బాగా కరిగించి ఆముదము ఆప్రికాట్ నూనెలను వేసి బాగా కలపండి. వేడిమీద తీసెయ్యండి. సముద్రపు ఉప్పును, ఆల్మండ్ పౌడర్ని కలిపి, షాంపూలో వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత ఉపయోగించండి.

Related:   కళ్ళను కాపాడుకుందాం

* బొప్పాయి కాయ సగం తీసుకోండి. దానికి నాలుగు టేబుల్స్పూన్ల బియ్పప్పిండి మొత్తాన్ని కలిపి బాగా గుజ్జుగుజ్జుగా పిసకండి. అందులో కొన్ని చుక్కల ఆరెంజ్ నూనెను కలపండి. మొత్తం కలిసేలా కలియబెట్టండి. మిశ్రమమైన ఆ పదార్థాన్ని చేతివేళ్ల చర్మంతో ముఖానికి గుండ్రంగా పూస్తూ ముఖం మొత్తం కవర్ చేయండి. పావుగంట తర్వాత ఆయిల్ను మాయిశ్చరైజర్ను చేసుకోండి. ఆపై శుభ్రంగా వాష్చేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది.

* బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి, నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా మంచిదే! చర్మం కమిలిపోయిన చోట రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది.

* రెండు చెంచాల బంగాళాదుంప రసంలో చెంచా నిమ్మరసం కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పది నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఛాయ మెరుగుపడుతుంది. మొటిమలూ, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు దూరమవుతాయి.

* ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జూ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. తరవాత చన్నీళ్లలో తడిపిన వస్త్రంతో ముఖం తుడుచుకోవాలి. మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.

Related:   బరువుకు నీటి కళ్లెం

* బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.

* కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.

* నారింజ తొక్కల్ని అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టి చల్లార్చాలి. చల్లారినవాటితో మెడపైన, ముఖం మీద సుతిమెత్తగా రుద్ది అయిదు నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారంలో ఒక్కసారయినా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.

* టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే నల్ల మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.

* రెండు చెంచాల పాలల్లో, బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద ఆప్లై చేసి అరగంటయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చే చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.

??????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *