చిక్కుడు ఆవిరి కుడుములు

• చిక్కుడు ఆవిరి కుడుములు…

కావల్సినవి: బియ్యం రవ్వ- పావుకప్పు, బియ్యం పిండి- మూప్పావు కప్పు, పచ్చిమిర్చి- ఏడు, చిక్కుడు గింజలు- పావుకప్పు, చిక్కుడు కాయలు- ఏడు, ఉల్లిపొరక తరుగు- పావుకప్పు, కొత్తిమీర తరుగు- కట్ట, ఉప్పు- తగినంత

తయారి: ముందుగా తగినన్ని నీళ్లు వేసుకుని చిక్కుడు కాయలని, గింజలని ఉడికించి పెట్టుకోవాలి. నీళ్లు దగ్గరకు వచ్చిన తర్వాత అదే పాత్రలో పచ్చి మిరపకాయలని రుబ్బుకుని వేసుకోవాలి. ఇందులోనే బియ్యప్పిండి, నూక, ఉల్లిపొరక, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మూతపెట్టేయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి ఉక్కబెట్టాలి. పొయ్యి మీద నుంచి దింపి చల్లారిన తర్వాత చేత్తో కుడుముల్లా కానీ పల్చగ గారెల్లా కానీ ఒత్తుకుని ఇడ్లీల మాదిరిగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. టమాట సాస్‌తో తింటే భలే ఉంటాయి.

READ:   వంకాయ కాల్చిన పచ్చడి . ( వంకాయ బజ్జీ పచ్చడి )

Originally posted 2018-02-08 08:54:01.