చుండ్రును పోగొట్టాలంటే

—చుండ్రును పోగొట్టాలంటే —
***************************
బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు, చర్మ వ్యాధుల వల్ల చుండ్రు వస్తుంది. తలలో దురద, అకారణంగా జుట్టు రాలిపోవటం దీని ప్రధాన లక్షణాలు. ఆదిలోనే చుండ్రు విషయాన్ని తెలుసుకుని పరిష్కారం చేసుకోవాలి. చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొనే సులభ ప్రక్రియలు మీ ఇంటి వద్దే ఆచరించండి.
*.మందారం ఆకులను మెత్తగా నూరి, కుంకుడుకాయ రసంలో కలపాలి. దీన్ని వారానికి రెండుసార్లు తలకు బాగా మర్దించి ఆ తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. దీని వల్ల తలలో ఉండే దురద, చుండ్రు తొలగిపోతాయి. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

READ:   రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మన పూర్వీకులు తిన్న ఆహారాలు ఇవి ...

*. రేగు ఆకులను మెత్తగా నూరి, కుంకుడు కాయల రసంలో కలిపి తలంటుకుంటే జుట్టురాలటం తగ్గి చుండ్రు వదిలిపోతుంది.

*.గరికగడ్డి రసంలో కొద్దిగా ఉల్లి రసం కలిపి తరచూ తలకు పట్టిస్తే గుణం కనిపిస్తుంది.

*.కలబంద గుజ్జుతో తలంటుకుంటే త్వరగా చుండ్రు సమస్య పోతుంది.

*.నల్ల తులసి రసంలో కొద్దిగా బేకింగ్‌ సోడా, నిమ్మరసం కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేస్తుంటే జుట్టు రాలడం, చుండ్రు తగ్గిపోయి జుట్టు నల్లగా పెరుగుతుంది.

READ:   ApploadYou - Create your apps!

*.తమలపాకు రసం తీసి కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తల స్నానం చేస్తే చక్కని ఫలితం కలుగుతుంది.
*.ఉమ్మెత్తాకురసం తీసి కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించి స్నానం చేయాలి.

*.కొబ్బరి పాలను తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది.

*. నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్‌ సోడా కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేయాలి. దీని వల్ల దురద తగ్గుతుంది.

READ:   వాత రోగాలు ఆర్ధరైటీస్

*.తరచూ ఉసిరికాయ కషాయాన్ని తలకు మర్దనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

*. వేపాకు రసంలో కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల త్వరగా దురద తగ్గిపోతుంది. చుండ్రు మటుమాయం అవుతుంది.
ఇతర చర్మవ్యాధులు తగ్గిపోయి జుట్టు పెరుగుతుంది.

Originally posted 2019-02-12 08:33:31.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *