ఛత్రపతి శివాజీ సాహసాలు – 2

Spread the love

ఛత్రపతి శివాజీ సాహసాలు – 2
అనగా అనగా…..మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

ఓ సారి ఔరంగజేబు ముస్లిం సైనికులు తమ దుర్గం మీదకి దాడికి వస్తున్నారని శివాజీ సేనకి సమాచారం అందింది. తామున్న చోటుకు చేరాలంటే సన్నని లోయలో నుండి ప్రయాణించాలి. శివాజీ సేన, ముస్లిం సైనికులు లోయలో నుండిప్రయాణిస్తుండగా, సైనికుల మీదికీ, వారి గుర్రాల మీదికి పెద్దపెద్దబండరాళ్ళని కొండ అంచుల నుండి క్రిందికి దొర్లించారనీ ఆ విధంగా వారిని పార దోలారనీ కథనాలున్నాయి.

మరోసారి ఔరంగజేబు మద్దతుదారులైన ఓ సామంత ముస్లింరాజు శివాజీ దుర్గం మీదకి దండయాత్ర కొచ్చాడట.
అంత సైన్యాన్నిఎదుర్కొనేందుకు శివాజీ దగ్గర చాలినంత ధనమూ లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు.
ఉన్నది సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సుల
ే[లగాన్ సినిమాలో ఇండియన్ టీం లాగా].
ఉన్న పరిమిత వనరులతోనే ప్రతివ్యూహం పన్నారు. రాత్రికి శతృశిబిరం ఎక్కడ విడిది చేస్తుందో అంచనా వేసారు, ఆనుపానులు కనిపెట్టారు.

దానికి తగిన దూరంలో కనుచూపులో ఉండేటట్లు తమ విడిది [campaign] నిర్మించారు.
గుడారాలు వేసారు. కాగడాలు వెలిగించారు.

Also READ:   The Law of Life

గస్తీ ఏర్పాట్లుచేశారు.
దూరం నుండి ఇదంతా చూసిన శతృసైనికులకి ఆ చీకట్లో మండుతున్న కాగడాలు.
లెక్కకు మిక్కిలి గుడారాలు గుబులు పుట్టించాయి. గెలవగలమన్న ఆశనీ, ధైర్యాన్ని కోల్పోయారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు.

ఇలాంటి ప్రయత్నాల్లో శివాజీ, ఆయన అనుచరులూ, ఉన్నది కొద్దిమందే అయినా గుర్రాలు, ఉడుములూ, కోతులూ, పావురాలని కూడా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నారట.

ఈవిధంగా ధనబలాన్ని, అధికార బలాన్ని, కేవలం మనోబలంతో ఎదుర్కొన్న యోధులు మరాఠాలు. ఒకసారి ఔరంగజేబు శివాజీ తండ్రిని బంధించి, చర్చల కంటూ శివాజీని పిలిపించి బంధించాడు. శివాజీ చెరసాల నుండి మాసిన బట్టల మూటలో దాక్కొని చాకలి వాడి సాయంతోనూ, తన అనుచరుల సాయంతోను తప్పించుకున్నాడట.

ఆ సమయంలో ఆ మాసిన బట్టల మూటని చెరసాల కావలి వాళ్ళు గానీ పట్టుకుంటే, శివాజీతో పాటు చాకలి వాడూ మరణాన్ని ఎదుర్కొక తప్పదు. అయినా వాళ్ళు వెనుకడుగు వేయలేదు.
తమ ‘కర్తవ్యం’గా, దేన్ని తమంత తాముగా స్వీకరించారో, ఆ సంస్కృతీ పునఃప్రతిష్ఠ పట్ల వారి కున్న నిబద్దత అది! ధర్మ స్ఫూర్తి అది!మరోసారి కూడా ఔరంగజేబు శివాజీని, ఆయన జ్యేష్ఠపుత్రుడు శంభాజీని నిర్భందించాడు.

Also READ:   Empathy For The Refugee

శివాజీని చంపితే తన రాజ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న హిందువుల్లో అసంతృప్తి, తిరుగుబాటూ వస్తుందని భయపడి, సరియైన అదను కోసం ఎదురు చూస్తున్నాడు.
కొన్ని నెలలు గడిచాయి.

శివాజీ జబ్బుపడినట్లు నమ్మించాడు.
అయన అనుచరులు శివాజీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దైవపూజలు నిర్వహించేవారు.
ప్రతీరోజూ జైలులోని ఖైదీలకి, కావలి భటులకీ ప్రసాదాలు పంచిపెట్టేవారు.
మొదట్లో జైలు కావలి భటులూ, ఇతర సిబ్బంది ఈ ప్రసాదాలూ, మిఠాయిలు పట్ల జాగ్రత్తగా ఉండేవాళ్ళు.

ముందుగా పరీక్షించాక గానీ పంచి పెట్ట నిచ్చేవాళ్ళు కాదు, తామూ తినే వాళ్ళు కాదు.
అయితే మిఠాయిల్లో ఏ మతలబు లేదు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి.
నెమ్మదిగా ప్రసాదాలని పరీక్షించటంలో ఓ సాచాటు వచ్చింది.
యధాలాపంగా స్వీకరించటం మొదలు పెట్టారు. పరిస్థితి మామూలుగా, శాంతిపూరితంగా ఉంది.ఓ రోజు ప్రసాదంగా జైలుకు లడ్డూలు పంపబడ్డాయి. అయితే వీటిలో మత్తు పదార్ధం కలపబడింది. లడ్డూలు తిన్న జైలు సిబ్బంది, కావలి భటులూ, ఇతరులూ స్పృహ కోల్పోయారు.

Also READ:   వ్యాపార రహస్యం

తన అనుచరులూ, జైలులో తన అనుకూలురుల సాయంతో శివాజీ, శంభాజీ కూడా జైలు నుండి తప్పించుకోగలిగారు.[’ఇది కుట్రకాదా’ అని ఎవరైనా వాదిస్తే వారికి సమాధానం చెప్పకుండా ఊరుకోవాల్సిందే.
ఎందుకంటే ముస్లిం రాజుల కుట్రల వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ, శివాజీ జైలు నుండి తప్పించుకోవాడానికి పన్నిన పధకానికి వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ తేడా గమనించని వాళ్ళతో, వాదించి మాత్రం సాధించగల ప్రయోజనం ఏముంది?]శివాజీ సమాజంలో నీతినీ, ధర్మాన్ని, సంస్కృతినీ తిరిగి స్థాపించడానికి ఎంతో దీక్షతో పోరాడాడు.

అదే అయన జీవిత లక్ష్యం.
ఆ లక్ష్యసాధనలో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొడానికైనా, ప్రాణాలొడ్డానికైనా ఏక్షణమూ వెనుకాడలేదు. తన రాజ్యాన్ని సైతం ప్రజలకు తాను ఆదర్శంగాఉండేలాగా, ప్రజలు కూడా నీతీ ధర్మాల్ని ఆచరించేలాగా, ఉత్తేజపరుస్తూ పరిపాలించాడు.

Updated: July 16, 2019 — 2:47 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *