జగన్ ప్రభుత్వం పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు…!! – Pakka Filmy – Telugu

0
49


చట్టాలంటే విశ్వాసం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, రాజ్యాంగంపై నమ్మకం లేదు.. పనికిమాలిన వాడు పాలకుడైతే ఇలాగే ఉంటుంద౦టూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. జనం అల్లాడిపోతున్నారు, వైసిపికి భయపడి కాదు.. వీళ్ల వేధింపులకు తట్టుకోలేక పోతున్నారన్నారు. 1983 రాజకీయాలు వేరు..ఇప్పుడు రాజకీయాలు వేరు.. అప్పుడు సిద్దాంతాలు/ విధానాలు వేరు.. ఇప్పుడు సిద్దాంతాలు/ విధానాలు వేరు.. భూములు దోచేవాడు, ఖూనీలు చేసేవాడే రాజకీయాలు చేసే రోజులొచ్చాయన్నారు. ఎన్టీఆర్ సీటిచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో రూ 35వేలు ఖర్చు అయ్యింది.ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.4 వేలు ఇచ్చారట, మా బంధువులే చెప్పారన్నారు. పంచాయితీ ఎన్నికలొస్తే పోటీకి రాకూడదనే భయం రేకెత్తిస్తున్నారని, కానీ ఈ రోజుకూ ఎవరూ లొంగడానికి సిద్దంగా లేరని స్పష్టం చేసారు. ఈ కష్టకాలంలో కూడా లక్షలాది కార్యకర్తలు పార్టీకి దృఢంగా నిలబడిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నానన్నారు.

Please View My Other Sites

నరేగా బిల్లులు జాప్యం చేయగలరేతప్ప వాటిని ఆపలేరన్నారు. జగన్ కాదు కదా, ఆయన బాబు దిగివచ్చినా ఆపలేరని స్పష్టం చేసారు. టిడిపిని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు ఒక్కడిదే కాదు, షో వర్క్ చేయవలసిన సమయం కాదు, కష్టకాలంలో షో వర్క్ చేయకుండా అందరూ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావాలని పిలుపునిచ్చారు. అకస్మాత్తుగా ఫోన్ చేసి ఆందోళన చేయమంటే ఏవో కొద్దిమందితో చేస్తే ఇంపాక్ట్ రాదన్నారు. రెండు మూడు రోజుల ముందు చెబితే, వేలాదిమందితో చేస్తే ఆ ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుందన్నారు. పార్టీకి మనం ఎంత అవసరమో, మనకు పార్టీ అంతకన్నా అవసరం’’ అనేది అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మొన్న ఒకామె పించన్ తొలగించారని గింజుకుంటుంటే చెప్పాను, ‘‘గట్టిగా కొట్టుకోబాకు, ఇంకా 4 సంవత్సరాలు కొట్టుకోవాలని’’ చెప్పాను అంటూ హాస్యం పంచారు. ఇప్పటికీ నిద్ర పట్టడం లేదు రాత్రుళ్లు.. 23 సీట్లు ఇచ్చేంత తప్పు చేశామా..? ఓడిపోతే, ఓడిపోతాం రాజకీయంగా..అపోజిషన్ లో ఉన్నప్పటికన్నా ఎక్కువ కష్టపడ్డామన్నారు. అమ్మవడికి డబ్బుల్లేక, ఈ రోజు విశాఖలో 2వేల ఎకరాలు అమ్మేసి చేస్తాడంట అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ‘‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’’ ఇందులో తప్పేంటి..?బుర్ర ఉన్నోడు ఎవడైనా 3రాజధానులు అంటారా..? అని ప్రశ్నించారు. నీ దయవల్ల ఉద్యోగాలు వచ్చే కంపెనీలన్నీ పోయాయి. విశాఖలో ఏం చేస్తావు 3 బిల్డింగులతో..? అని ప్రశ్నించారు. నువ్వు చేశావా, నీ బాబు చేశాడా విశాఖకు ఏమైనా..? ఏదైనా చేస్తే చంద్రబాబు చేశాడు విశాఖకు అంటూ జగన్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. బొమ్మను మార్చినట్లు మారుస్తావా రాజధానిని..?

ఎన్నికల్లో ఎక్కడైనా చెప్పావా రాజధానిని మారుస్తానని..? లేదూ మేనిఫెస్టోలో రాశావా..? ఇదేమైనా చిన్నవిషయమా, చాలా సీరియస్ విషయమన్నారు. పెద్దలందరినీ కూర్చోపెట్టి నా ఆలోచన ఇదని చెప్పావా..? ఎవరితోనైనా చర్చించావా..? ప్రజాభిప్రాయం తీసుకున్నావా..? నీకు సిగ్గు లేకపోతే, అది చేసే వాళ్లకైనా సిగ్గుండాలి కదా..? అని నిలదీశారు. రాజధానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది, మరి దానిని మారుస్తానని వాళ్ల పర్మిషన్ తీసుకున్నావా..? శంకుస్థాపన చేసిన ప్రధానికి అయినా చెప్పావా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాలలో ఇలాంటి తిక్క పనులు చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోరాదన్నారు. ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అతని దురుద్దేశమన్నారు. 25 మంది ఎంపిలనిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పి, ఈ 8 నెలల్లో ప్రత్యేక హోదా గురించి ఎక్కడన్నా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. హోదా గురించి జగన్ మాట్లాడి ఎన్ని నెలలైంది..? మా రామ్మోహన్ నాయుడు, మా జయదేవ్ మాట్లాడుతుంటే, మీ వాళ్లను ఆ ఇద్దరి మీదకు ఉసిగొల్పుతావా..? అంటూ మండిపడ్డారు.

Also READ:   నగరి: ఉల్లిపాయలు అమ్మిన ఎమ్మెల్యే రోజా