జుట్టు రాలకుండా పెరగడానికి గృహ చిట్కాలు

జుట్టు రాలకుండా పెరగడానికి గృహ చిట్కాలు??
1.కొబ్బరి నూనె:నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ మర్దన చేసుకోవాలి దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి.. 2.ఉసిరి : జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది. 3.పెరుగు :జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు.  4.గోరింటాకు :పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి. 5.కొబ్బరిపాలు:కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. 6.మందారం :మందారం పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి…జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలును ఎక్కువగా తీసుకోవాలి..ఆందోళనలకు గురవడం వల్లకూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి…

Related:   కలబందతో అందంగా మెరిసిపోవడం ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *