జుట్టు రాలిపోవడాన్ని ఆపలేమా? ఇదేమైన వారసత్వపు సమస్యా?

Spread the love

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:

*

జుట్టు రాలిపోవడాన్ని ఆపలేమా? ఇదేమైన వారసత్వపు సమస్యా?

*
చాలా మందికి చిన్నవయసులోనే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. తలస్నానం చేసేందుకు వాడే షాంపుల వల్ల, తలకు వాడుతున్న తలైలా వల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. అసలు జుట్టు రాలడాన్ని ఆపలేమా? ఇదేమైనా వారసత్వపు సమస్యా? అని పరిశీలిస్తే…
వెంట్రుకల పోషణకు అవసరమైన ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, జింక్‌, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు జీవనశైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి.
ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి. అంతేకానీ, ప్రతి సమస్యనూ వారసత్వ మూలాలకే ఆపాదించడం మంచిదికాదు. ఎందుకంటే, పోషకాలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అతని జుత్తు రాలిపోయి ఉండవచ్చు.
వ్యాధులు రావడానికి గల కారణాలు
• సమయం తప్పిన భోజనము

Also READ:   Fear of Flying Phobia | Takeoff Today! Get Your FREE Fear of Flying Report and Overcome Your Flying Anxiety

• మనో దుఃఖము

• అధికంగా బయట తిరుగుళ్లు

• దాహం వేసినా నీళ్లు తాగకుండా వుండటం

• మల, మూత్ర విజర్జనను ఆపుకొనుట

• కొత్త నీళ్లు తాగుట

• కాలుష్య కారకాల మధ్య ఎక్కువగా వుండుట

• రాత్రి పూట పెరుగు అన్నం తినుట

• లేత ఎండ సోకుట

• పాచిన కూరలు భక్షించుట
వ్యాధులు రాకుండా వుండటానికి ఇలా చేయాలి
• పరిశుధ్ధమైన భోజనము

Also READ:   పాదాలపై పగుళ్లు పోయేదెలా?

• భోజనము తరువాత 100 అడుగుల వరకైననూ నడవడం

• స్నానపానములు క్రమం తప్పకుండా వుండుట

• మల విసర్జనమును దినమునందు రెండుమార్లు చేయుట

• దినమునందు రెండుమార్లు భోజనము రాత్రి పాలతో భోజనము

• సకాలమున నిద్ర

• ఎడమప్రక్కకు వాలి నిదురించుట

• సాయంకాలపు ఎండ సోకుట

• కాచి వడపోసిన నీళ్ళు తాగుట

Updated: January 7, 2019 — 2:44 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *