జోడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Jodi movie review and rating

0
125

Please View My Other Sites


జోడి కథ

కపిల్ (ఆది సాయికుమార్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన తండ్రి (వీకే నరేష్) క్రికెట్ బెట్టింగ్ పిచ్చితో అనేక ఇబ్బందులు పడుతుంటాడు. ఆ క్రమంలో కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ వ్యవహారం పెళ్లిగా మారే సమయంలో తండ్రి చేసిన నిర్వాకం కపిల్‌‌కు ఓ సమస్యగా మారుతుంది. కాంచనమాల బాబాయ్ (సిజ్టు) పెళ్లికి నిరాకరిస్తాడు.

జోడి సినిమాలో ట్విస్టులు

జోడి సినిమాలో ట్విస్టులు

కపిల్, కాంచనమాల పెళ్లికి తండ్రి ఎలా అడ్డుగా మారాడు? తండ్రి బెట్టింగ్ పిచ్చి వల్ల కపిల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తన ప్రేమను కాపాడుకోవడానికి, తండ్రిని జూదం అలవాటు నుంచి మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకొన్నాడు. చివరకు కథలో విలన్‌గా దూసుకొచ్చిన వ్యక్తిని ఎలా అడ్డుకొన్నాడు? విలన్ వేసే ఎత్తులకు కపిల్ ఎలా పైఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే జోడి కథ.

Also READ:   వజ్ర కవచధర గోవింద మూవీ రివ్యూ అండ్ రేటింగ్: సప్తగిరి ఊర మాస్ | Vajra Kavachadhara Govinda review
-->

జోడి సినిమా విశ్లేషణ

జోడి సినిమా విశ్లేషణ

మద్య, ధూమపానం ఓ వ్యక్తిని చంపేస్తాయి. కానీ జూదం ఆ వ్యక్తినే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా చంపేస్తాయి అనే చక్కటి పాయింట్‌ జోడి సినిమా రూపొందింది. వ్యక్తిగతంగా పాత్రలను చూస్తే సినిమా బాగుంటుంది. మొత్తంగా పాత్రలన్నీ కలిపి చూస్తే.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన మ్యాజిక్ కనిపించదు. స్క్రిప్టుపై సరైన కసరత్తు జరగకపోవడం, కథ, పాత్రల కోసం ఎంచుకొన్న బ్యాక్‌డ్రాప్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఫ్యామిలీ, ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండి ఉంటే తప్పకుండా మంచి సినిమా అయ్యేది. దర్శకుడు విశ్వనాథ్ ఆ అవకాశాన్ని జారవిడచుకున్నారని చెప్పవచ్చు. అలాగని చెత్త సినిమా అని కొట్టిపారేయలేం. స్లోగా కథను నడిపించడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. రకరకాల ట్విస్టులు ఉన్నా సినిమాపై జోష్ పెంచలేకపోయాయి.

ఆది, శ్రద్దా శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్

ఆది, శ్రద్దా శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్

ఇక సాయికుమార్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. యాక్టింగ్ పరంగా ఆది విషయానికి వస్తే.. కపిల్ పాత్ర తనకు కొట్టిన పిండే. సినిమాను నెక్ట్స్ లెవెల్ తీసుకెళ్లే అంశాలు లేకపోవడం, టిట్ ఫర్ టాట్ అంశాలు ఓ పక్క, లవ్ ట్రాక్ మరో పక్క, తండ్రి ఎపిసోడ్ రకరకాల అంశాలు కపిల్ పాత్రపై మితిమీరిన భారం పడ్టట్టు అనిపిస్తుంది. పలు రకాల వేరియేషన్‌‌ను హ్యాండిల్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ కూడా గ్లామర్ పాత్రలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కొన్ని సీన్లలో మెచ్యురిటీ కనిపించింది. సున్నితమైన రొమాన్స్ పండించేందుకు ప్రయత్నం చేసింది. నరేష్, సిజ్జు పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్.

Also READ:   దొరసాని మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Dorasani movie review and rating
-->

సాంకేతికంగా

సాంకేతికంగా

జోడి సినిమాకు సినిమాటోగ్రఫి, మాటలు అదనపు ఆకర్షణ. రెయిన్ ఎఫెక్ట్ సీన్లు, నైట్ ఎఫెక్ట్ షాట్స్ సాంకేతికంగా బాగున్నాయి. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే.. నిన్ను చూస్తే మీ నాన్న కనిపిస్తున్నాడు లాంటి భావోద్వేగమైన మాటలు చాలానే ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. రవి మండ్ల తన కత్తెరకు కాస్త పదును పెట్టాల్సిందనిపిస్తుంది. సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్ అందించిన పాటలు ఒకట్రెండు ఫర్వాలేదు. కానీ రిరీకార్డింగ్ ఈ సినిమాకు ఎంత కావాలో అంతే ఇచ్చాడని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Also READ:   Thippara Meesam Movie Review: శ్రీవిష్ణు మాస్‌గా చూపించడానికి చేసిన ప్రయోగం
-->

ఫైనల్‌గా

ఫైనల్‌గా

బెట్టింగ్, జూదం బారిన ఇంటి పెద్ద పడితే.. తన కుటుంబానికి కాదు.. ఇతర కుటుంబాలపై ఎలాంటి దుష్ప్రలితాలు చూపిస్తాయనే మంచి పాయింట్‌తో జోడి రూపొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడాలంటే జోడి క్లీన్ మూవీ. ఎలాంటి అసభ్యత, అశ్లీలానికి చోటు లేదు. బలహీనమైన కథనమే ఈ సినిమాకు మైనస్. కొన్ని ఎమోషనల్ సీన్లు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్, మంచి మెసేజ్‌ను ఆధారంగా చేసుకొని తెలుగు ఫిల్మీబీట్ ఇస్తున్న రేటింగ్ 2.5/5

తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, వికే నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ తదితరులు

సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్,

సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్,

ఎడిటర్ : రవి మండ్ల,

ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ,

మాటలు : త్యాగరాజు (త్యాగు),

నిర్మాతలు: శాంతయ్య, నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం,

దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల

బ్యానర్: భావనా క్రియేషన్స్ బ్యానర్