టాయిలెట్‌లో ప్రశాంతంగా పోసుకోనీయవా.. సందీప్ కిషనా?

Spread the love

‘నిను వీడని నీడను నేనే’.. అంటే ఏదో అనుకున్నాం కాని.. పేరు తగ్గట్టుగానే ప్రేక్షకుడు ఎక్కడికి వెళ్లినా వీడటం లేదు . ఆఖరుకి టాయిలెట్‌లను కూడా వీడటం లేదు. ప్రశాంతంగా పోసుకుందాం అని టాయిలెట్‌కి వెళ్లిన వాళ్లకు ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..! .. జూలై 12న వచ్చేస్తున్నా’ అంటూ బోర్డ్ పట్టుకుని టాయిలెట్‌కి వెళ్లే వాళ్లను భయపెడుతున్నాడు సందీప్ కిషన్.

హీరోగా సందీప్ కిషన్.. నటిస్తూ నిర్మిస్తున్న ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన తిప్పలే ఈ టాయిలెట్ ప్రమోషన్స్. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వినూత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు.

Also READ:   Kajal Agarwal Birthday Poster: ‘రణరంగం’.. కాజల్ క్రేజీ బర్త్‌డే లుక్ - kajal agarwal look from ranarangam revealed on her birthday

హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్స్‌లోని టాయిలెట్స్‌లో ‘నిను వీడని నీడను నేనే’ బోర్డ్‌లను ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ కోసం వెళ్లిన వాళ్ళు ఈ బోర్డ్‌లు చూసి ఈ రకంగా కూడా ప్రచారం చేయొచ్చా అని నవ్వుకుంటున్నారు.

టాయిలెట్ కోసం వెళ్లిన వాళ్లకు.. ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..! నిను వీడని నీడను నీనే..’ అంటూ బోర్డ్‌తో పాటు.. ‘నాకు హారర్ ఫిల్మ్స్ అంటే భయం.. ఫాస్ట్‌గా జిప్ మూసెయ్.. నిను వీడని నీడను నీనే’, ‘అద్ధంలో చూసుకున్నప్పుడు జాగ్రత్త.. దెయ్యాలు ఉంటాయి’ లాంటి కొటేషన్స్ ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.

Also READ:   యాత్రలెందుకు?

ప్రమోషన్స్ ఎక్కడ చేస్తే ఏం.. ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంతే.. పైగా అందరూ వెళ్లే చోటంటే టాయిలెట్ ఒకటి. దాన్ని వదిలితే ఎట్టా.. అనుకున్నారో ఏమో కాని.. మొత్తానికి ‘నిను వీడని నీడను నేనే’ ప్రమోషన్స్ వినూత్నంగా ఉన్నాయనే చెప్పాలి.

ఈ చిత్రాన్ని విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని క్రిష్ణమురళి, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామక్రిష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు.

Also READ:   SIIMA Awards 2019: సైమా అవార్డ్స్.. ‘రంగస్థలం’కు అత్యధిక నామినేషన్లు - ram charan's rangasthalam gets most nominations in siima awards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *